అనకాపల్లిలో మహిళా ఆరోగ్య అవగాహన శిక్షణా కార్యక్రమం..

అనకాపల్లిలో మహిళా ఆరోగ్య అవగాహన శిక్షణా కార్యక్రమం..

07/July/2026 21:46    Share:   

అనకాపల్లి వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 70 మంది కుశల్ మిత్ర సభ్యులు ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, సమాజంలో చురుకుగా సేవలు అందించే సభ్యుల సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

  • డా. విక్షిత్ గాయత్రి రుతు విరతి (మెనోపాజ్) లక్షణాలు, దాని వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై వివరించారు. ప్రతి మహిళకు సరైన అవగాహన అవసరమని సూచించారు.డా. ఎం. అబ్రహాం మహిళా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సమాజ అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. కుశల్ మిత్ర సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.డా. జీవన్ రొమ్ము క్యాన్సర్, ముఖ్యంగా సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు, ముందస్తు గుర్తింపు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.డి. వరలక్ష్మి రుతుక్రమ పరిశుభ్రత, రజోనివృత్తి, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ, బాలింతల పోషణ, తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించారు.
    న్యాయవాది డి. అనిల్ మహిళల రక్షణకు సంబంధించిన తాజా చట్టాలు, హక్కులు, న్యాయపరమైన రక్షణ అంశాలపై అవగాహన కల్పించారు.
    మహిళా పోలీసు జి. సత్యదేవి మహిళా పోలీసుల సేవలు, సమాజంలో వారి పాత్రను వివరించారు. మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.స్థానిక నాయకులు బి. జోగినాయుడు, బి. శ్రీనివాస్ కార్యక్రమాన్ని అభినందించారు. సమన్వయం ఎన్. దివ్య నిర్వహించగా, కుశల్ ప్రాజెక్టు సిబ్బంది ఉషా, పార్వతి, భవాని, శర్మిల, లక్ష్మి కామాక్షి తదితరులు పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter