శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు

శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు

07/July/2026 21:22    Share:   

యలమంచిలి స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ (JKC) మరియు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు పోటీ పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రేమా చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ నైపుణ్యాల విశిష్టతను మరియు వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్ వి.ఎ. సత్యనారాయణ గారు మాట్లాడుతూ విద్యార్థులు తమ కెరీర్‌ను ఏ విధంగా ఉన్నతంగా మలుచుకోవాలో దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ డిప్యూటీ చీఫ్ కే. దొరబాబు గారు మాట్లాడుతూ.. విద్యార్థులకు 'నైపుణ్యం యాప్', 'ఎన్ఎస్సీఆర్ (NSCR) ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ యాప్' వంటి సాంకేతిక వేదికల ప్రాముఖ్యతను, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ కే. శాంతి గారు మాట్లాడుతూ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో ప్రభుత్వ పాత్రను కొనియాడారు. అలాగే వివిధ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల గురించి విద్యార్థులకు సమగ్ర సమాచారం అందించారు.
కేంద్ర ప్రభుత్వ యంగ్ ప్రొఫెషనల్ డి. శ్యామ్ గారు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి జీవితంలో 'స్వాట్ అనాలసిస్' (SWOT Analysis - బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్ల అంచనా) ఎంతో ముఖ్యమని చెప్పారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల ప్రిపరేషన్ ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా ఉండాలో ఆయన వివరించారు.
చివరగా కళాశాల జేకేసీ (JKC) కోఆర్డినేటర్ కె. వెంకన్న మాట్లాడుతూ.. కళాశాలలో అందుబాటులో ఉన్న వివిధ వసతులను, ఫెసిలిటీలను విద్యార్థులు సంపూర్ణంగా వాడుకుని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, మూడవ సంవత్సరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 
Breaking News

Subscribe our Newsletter