వైభవంగా ప్రారంభమైన VMRDA శ్రీ రావు గోపాల్ రావు కళాకేంద్రం

వైభవంగా ప్రారంభమైన VMRDA శ్రీ రావు గోపాల్ రావు కళాకేంద్రం

02/July/2026 20:43    Share:   

అనకాపల్లి పట్టణంలో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో VMRDA ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన VMRDA శ్రీ రావు గోపాల్ రావు కళాకేంద్రం జూలై 2న సాయంత్రం 4 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ సారథ్యం వహించారు.ఈ ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర హోం శాఖామాత్యులు వంగలపూడి అనిత, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సి.ఎం. రమేష్, VMRDA చైర్మన్ ప్రణవ గోపాల్, మాజీ శాసనసభ్యులు, అనకాపల్లి నియోజకవర్గం TDP ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, జిల్లా TDP అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, BJP జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter