కుమారుడి అంత్యక్రియలకు నిందితుడికి పరోల్ – పోలీసుల మానవత్వానికి ప్రశంసలు

కుమారుడి అంత్యక్రియలకు నిందితుడికి పరోల్ – పోలీసుల మానవత్వానికి ప్రశంసలు

03/June/2026 22:12    Share:   

వి.మాడుగుల, అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు (అలియాస్ మహాలక్ష్మినాయుడు) ఎన్‌డిపిఎస్ చట్టం కింద విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని పెద్ద కుమారుడు పెచ్చేటి సాయి కిరణ్ (17) మృతి చెందడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్‌ను ఆశ్రయించారు.

కుటుంబ పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించిన ఎస్పీ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు తాత్కాలిక విడుదల (పరోల్) మంజూరు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోలీసు భద్రత నడుమ పెచ్చేటి రాజు జంపెన గ్రామానికి చేరుకుని తన కుమారుడి పిండ ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Breaking News

Subscribe our Newsletter