యలమంచిలి రూరల్:
లారీ నిర్లక్ష్యం ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాన్ని బలితీసుకుంది. స్కూటీపై విధులకు వెళ్తున్న పంచాయతీ సెక్రటరీని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
పాయకరావుపేటకు చెందిన కిల్లాడ బాబూరావు (52, తండ్రి: అప్పలకొండ) నక్కపల్లి మండలం, N. నర్సాపురం గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మంగళవారం (30.06.2026) ఉదయం ఆయన పాయకరావుపేట నుండి అనకాపల్లి డీపీఓ (DPO) ఆఫీసుకు పనిమీద తన స్కూటీ (AP 31 EU 4992) పై బయలుదేరారు.
ఉదయం 11:00 గంటల సమయంలో యలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్ వద్దకు చేరుకోగానే, వెనుక నుండి అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన లారీ (AP 39 UZ 9687) ఆయన స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబూరావు స్కూటీతో సహా రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.