ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్క రించడమే మా లక్ష్యం,ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్.

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్క రించడమే మా లక్ష్యం,ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్.

30/June/2026 08:38    Share:   

ప్రజల సమస్యలను త్వరితగతిన, పార దర్శకంగా పరిష్క రించడమే మా లక్ష్యం గా   ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారు పబ్లిక్ గ్రీవెన్స్ ను నిర్వహించినారు
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లోని కాన్ఫరెన్స్ మంది రంలో  ప్రజల సమస్య ల పరిష్కార వేదిక  కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నిర్వ హించిన జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు,  అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ వై ప్రసాద్ రావు గారితో కలిసి జిల్లా నలు మూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో సాంకే తికతను జోడించి, పేపర్ లెస్ పద్ధతి లో పారదర్శక మైన ఆన్‌ లైన్ విధానంలో నిర్వహించినారు.
ఈ రోజు జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుండి 62 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రధానంగా భూ వివా దాలు  కుటుంబ తగాదాలు ఆర్థిక  మోసాలు ఎస్పీ గారు ప్రతి ఒక్క ఫిర్యాదు దారుడితో స్వయంగా మాట్లాడి, వారి సమస్య లను ఓపికగా విన్నారు. సదరు ఫిర్యా దులపై చట్టప్రకారం తక్షణమే నిష్పక్ష పాతంగా విచారణ చేపట్టి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని,  విచారణ నివేదికలను సకాలంలో సమర్పించాలని సంబం ధిత  అధికారు లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
ప్రజల కోసం ప్రత్యేక వెసులుబాట్లు  ఎస్పీ గారి సూచనలు దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి డబ్బు, సమయం వృథా చేసుకోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ గారు పలు కీలక వెసులుబాట్లను మరియు ప్రత్యా మ్నాయ మార్గాలను వివరించారు.
సమీప కార్యా లయాల్లో ఫిర్యాదు ప్రజలు తమ సమస్య లపై నేరుగా తమ సమీపంలోని సబ్-డివిజన్  లేదా సర్కిల్  కార్యాల యాల్లో ఫిర్యాదు చేయవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవారు నేరుగా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
టోల్-ఫ్రీ నెంబర్ ప్రజలు తాము చేసిన ఫిర్యా దుల స్థితిగతులను , పురోగతిని సులభంగా తెలుసుకోవడానికి 1100 టోల్-ఫ్రీ నెంబర్ ను సంప్రదించవచ్చు 
జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్ల ప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, బాధితు లకు త్వరితగతిన న్యాయం జరిగేలా పారదర్శకమైన సేవలు అందిస్తామని ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఏలూరు జిల్లా శ్రీ సత్య సాయి సంఘం వారు ఫిర్యాదుల పరిష్కార వేదిక హాజరైనటువంటి ఫిర్యాదు దారులకు భోజన సదు పాయాలను కల్పిచారు
Breaking News

Subscribe our Newsletter