దేశానికి వెన్నుముక రైతన్న,ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి).

దేశానికి వెన్నుముక రైతన్న,ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి).

30/June/2026 08:33    Share:   


#రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది
#ఏరువాక పౌర్ణమి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రైతన్నల పండుగ
#చొదిమెళ్ళలో  ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) తో కలిసి  పాల్గొని, ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని  లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
దేశానికీ వెన్నుముక రైతన్న అని, రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.  ఏలూరు రూరల్ మండలం  చొదిమెళ్ళ గ్రామంలో సోమవారం  ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) తో కలిసి  ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి  లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రైతన్నలు పండుగ అని, రైతులంతా పంటలకు శ్రీకారం చుట్టే తొలిరోజన్నరు.  వ్యవసాయం దేశానికి, రాష్ట్రానికి వెన్నెముక అని, రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సాంప్రదాయ విలువలను కూడా కొనసాగించాలని సూచించారు.  . రాష్ట్ర  ప్రభుత్వం రైతులు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు ఏమి కావాలన్నా చెయ్యుటకు జిల్లా యంత్రాంగం  సిద్ధంగా ఉందని అన్నారు. అనంతరం రైతులతో మమేకమై వారి సమస్యలు, సాగు పరిస్థితులుపై జిల్లా కలెక్టరు ఆరా తీశారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు. భూసారం వివరాలను రైతులకు తెలియజేసి, అందుకు తగిన విధంగా ఎరువుల వాడకం చేసేలా 31 వేల భూసార పరీక్షల కార్డులను రైతులకు అందించామన్నారు. గత రెండు సంవత్సరాలలో 681 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని, ధాన్యం అందించిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలకు సొమ్ము జమచేశామన్నారు.  అన్నదాతా సుఖీభవ,  సాగులో యాంత్రీకరణను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, డ్రోన్లు వంటివి రైతులకు సబ్సిడీపై అందిస్తున్నదని , రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉందని, రైతులు వ్యవసాయ శాస్త్రజ్ఞులు, అధికారుల సూచించిన వరి వంగడాలను వేయాలన్నారు. రైతులు, కౌలు రైతులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వ్యవసాయాధికారులు లేదా తన దృష్టికి తీసుకురావాలన్నారు.
ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ   ఏరువాక పౌర్ణమి అనేది తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎంతో వైభవంగా జరుపుకునే తొలకరి వ్యవసాయ పండుగ అని అన్నారు. జ్యేష్ఠ పౌర్ణమినాడు జరుపుకునే ఈ పండుగతోనే రైతులు కొత్త వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారని అన్నారు. తొలకరి జల్లులు కురిసిన తర్వాత, భూమిని దున్నడానికి సిద్ధం చేయడాన్ని 'ఏరువాక' అంటారని తెలిపారు. పొలంలో మొదటిసారి నాగలిని (ఏరును), వ్యవసాయ పని ముట్లను పూజించి దుక్కి దున్నడం ఈరోజున ప్రారంభిస్తారని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యతను ఇస్తున్నదని, విత్తు వేసిన దగ్గర నుండి రైతు పండించిన పంటను గిట్టుబాటు ధర కల్పించేవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ రైతుకు అండగా ఉంటుందన్నారు. అన్నదాత సుఖీభవ పధకం కింద ప్రతీ రైతుకు  ఏటా 20 వేల  రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నదన్నారు.  పంట రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, సాగు యంత్రాలు సరఫరా,  పంటల భీమా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతు పండించిన  పంటను కొనుగోలుచేసి వెంటనే సొమ్మును రైతుకు ఖాతాకు జమచేయడం చేస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం. పార్థసారధి, వ్యవసాయ శాఖ జెడి యస్.కె. హబీబ్ భాషా, వ్యవసాయ శాఖ అధికారులు అనిల్ కుమార్, సంతోష్, తహసీల్దార్ గాయత్రి, శనివారపుపేట సహకార బ్యాంకు చైర్మన్ కోనేరు వంశీ కృష్ణ,   స్థానిక ప్రజా ప్రతినిధులు యడ్లపల్లి శివ,చల్లారి శ్రీనివాసరావు, వి. రంగారావు, బి. వెంకటేశ్వరరావు, కె. సత్యనారాయణ, మార్గాని  రాము,  యడ్లపల్లి పుష్పలత, రావూరి జయలక్ష్మి   ,వివిధ శాఖలు అధికారులు, రైతులు, కౌలు రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter