ఆత్మ వారి ఆధ్వర్యంలో బయో ఫెర్టిలైజర్ ఎరువుల వాడకం పై రైతులకు శిక్షణ కార్యక్రమం

ఆత్మ వారి ఆధ్వర్యంలో బయో ఫెర్టిలైజర్ ఎరువుల వాడకం పై రైతులకు శిక్షణ కార్యక్రమం

30/June/2026 07:36    Share:   

యలమంచిలి/రాంబిల్లి మండలం మామిడివాడ గ్రామంలో  ఈరోజు ఆత్మ వారి ఆధ్వర్యంలో బయో ఫెర్టిలైజర్  మరియు నానో ఎరువుల వాడకంపై  రైతులకు శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం ద్వారా రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో మట్టి నమూనాల సేకరణ ప్రాముఖ్యత, నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, జీవ ఎరువులు, సేంద్రియ ఎరువులు మరియు పచ్చిరొట్ట ఎరువుల ఉపయోగాల గురించి వివరించారు. అలాగే అధికంగా యూరియా వాడటం వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు.
రైతులు  మధ్య చర్చా కార్యక్రమం నిర్వహించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు మరియు వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ పద్ధతుల గురించి సమాచారం అందించారు.పి.శ్రీధర్  ఏడిఏ ‌డి ఆర్ సి అనకాపల్లి మాట్లాడుతూ రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల నేల సారం తగ్గి, భవిష్యత్తులో దిగుబడులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వాడటం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సాగు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని సూచించారు. పి.శ్రీహరి బిసిటి శాస్త్రావేత్త  వరి పంటలో తీసుకోవాల్సిన పద్ధతులను రైతులకు సూచనలు అందించారు.మండల వ్యవసాయ అధికారి సి హెచ్. సుమంత  మాట్లాడుతూ ఏపీ ఏఐఎంఎస్ ద్వారా ఎరువులు సరఫరా గురించి రైతులకు వివరించడం జరిగినది. పి.విజేత వ్యవసాయ అధికారి జిల్లా వనరుల కేంద్రం అనకాపల్లి మాట్లాడుతూ విత్తన శుద్ధి యొక్క ప్రాముఖ్యత వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ రామారావు ,ఏఈవొ దేముడు మరియు రైతులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter