ఘనంగా మాజీ ప్రధాని, భారతరత్న పీవీ.నరసింహారావు 105వ జయంతి..
28/June/2026 12:00
Share:
రిపోర్టర్:కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ క్రెమ్/ ఆనాలసిస్ యలమంచిలిలో గల పీవీ కాంప్లెక్స్ వద్ద మాజీ ప్రధాని, భారతరత్న పీవీ.నరసింహారావు 105వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యలమంచిలి పట్టణములో పీవీ కాంప్లెక్స్ లో గల పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా స్థానిక గాయత్రి వేద పాఠశాల ఆధ్వర్యంలో పీవీ విగ్రహానికి పుష్ప మాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా గాయత్రి సేవా ట్రస్ట్ గౌరవ చైర్మన్ సోమేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి ప్రధానమంత్రి అయిన తొలి తెలుగువాడు,బహు భాషా కోవిదుడు అయిన పీవీ ని తెలుగువారు మరచిపోవడం కడు శోచనీయం అన్నారు.నరసింహారావు ప్రధానమంత్రిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా,కేంద్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా,మానవ వనరుల శాఖ మంత్రిగా, ఆర్ధికమంత్రిగా,రక్షణశాఖ మంత్రిగా పనిచేసి తెలుగువారి ఘనతను మరింత పెంచారన్నారు.ఐదు సార్లు లోకసభ కు ఎన్నికైన పీవీ ఎన్నో ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశంలో సరళ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారన్నారు.ఇటువంటి మహనీయుణ్ణి స్మరించుకోవడం ,వారి బాటలో నడవడం యువత నేర్చుకోవాలని హితవు పలికారు.అనంతరం పీవీకి అంజలి ఘటించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సేవా ట్రస్ట్ కార్యదర్శి పెద్దింటి సూర్యనారాయణమూర్తి, ట్రస్ట్ సభ్యులు రాచకొండ శ్రీనివాస్ శర్మ, వడ్లమాని మోహన్,కామేశ్వర రావు, సి.హెచ్.సంతోష్, రాయవరపు రాజు, ఆకొండి సాయి, ఆకొండి బాబీ,వేద పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.