వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొడతాం: ఎమ్మెల్యే బడేటి చంటి
22/June/2026 08:21
Share:
* వైసీపీ కుల రాజకీయాలు, శవ రాజకీయాలు మానుకోవాలి..
* తప్పుడు ప్రచారాలను విషం మాదిరిగా కూటమి ప్రభుత్వం పై జల్లేందుకు వైసీపీ నాయకులు వెనుకాడడం లేదు..
* మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, రాష్ట్రంలో ఎటువంటి ఘటన జరిగినా దానిపై కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం వైసీపీ విష సంస్కృతిలో భాగమైపోయిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారాలను విషం మాదిరిగా కూటమి ప్రభుత్వంపై జల్లేందుకు కూడా వైసీపీ నాయకులు వెనుకాడడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన వారు, సాయికృష్ణ మిస్సింగ్ కేసు అంశంలో వైసీపీ చేస్తున్న దుష్ట రాజకీయ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఈ విషయంలో వైసీపీ మరోసారి తన దుష్టబుద్ధిని బయటపెట్టిందంటూ ధ్వజమెత్తారు. కాపు కులస్తుడ్ని చంపేస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించరా అంటూ వైసీపీ నేతలు దుష్ట పన్నాగాల ప్రగల్బాలు పలకడం దేనికి సంకేతమంటూ ఆయన ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తుల కులాల పేర్లతో నిస్సిగ్గుగా తమ పబ్బం గడుపుకునేందుకు కూడా వైసిపి నాయకులు వెనుకాడడం లేదంటూ ఆయన ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి రాజకీయాలు చేస్తేనే వైసిపిని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్న ఆయన, మరోసారి ఇటువంటి వేషాలే వేస్తే ప్రజలే గట్టి బుద్ది చెప్తారంటూ ఎమ్మెల్యే చంటి హెచ్చరించారు. ఆర్టీసి జోన్ 2 చైర్మన్, ఏలూరు జనసేన ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబేనని చెప్పారు. సాయికృష్ణ తల్లి ఆవేదనను చూసిన సీఎం చంద్రబాబు ఆమెతో మాట్లాడి ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించడంతో పాటూ, ఆ సర్కిల్ సీఐ నాగరాజు ని సస్పెండ్ చేసినా కూడా వైసిపి నేతలు తమ కుయుక్తులను ఆపడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయికృష్ణ మృతిపై కమిటీ వేసి విచారణ జరిపించి చట్టం దృష్టిలో ఎవరైనా సమానమే అనే విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందన్నారు. సాయికృష్ణ తల్లి మరియు మేనమామ ఇచ్చిన సమాచారంతో విచారణ జరిపించి న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారని, ఇకనైనా జగన్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివ ప్రసాద్, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతిరావు తదితరులు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు..