యోగ ఒక ఉత్తమ జీవనశైలి.. ప్రతీ ఒక్కరూ తమ జీవన విధానంగా మార్చుకోవాలి
17/June/2026 20:51
Share:
మన యోగా ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించిన విదేశీయులు యోగా ను వారి జీవన విధానంగా మార్చుకున్నారు. ఏలూరులో విద్యార్థులతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, యోగ ఒక ఉత్తమ జీవనశైలి అని, విద్యార్థి దశనుండి యోగా ను తమ జీవన విధానంగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో బుధవారం విద్యార్థులతో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ యోగా ఎన్నో శతాబ్దాలుగా భారతీయుల జీవన శైలి అన్నారు. యోగా ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించిన విదేశీయులు యోగా ను తమ జీవన విధానంగా మార్చుకున్నారన్నారు. యోగా ఏదో ఒకరోజు చేసి మానివేయకుండా, ప్రతీ రోజూ అర గంట నుండి గంట సమయాన్ని యోగాకు కేటాయించి అభ్యాసం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చన్నారు. యోగా ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందన్నారు. భారతీయ సంస్కృతి భాగమైన యోగా సంపదను భావితరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అన్ని వర్గాలు ప్రజలు యోగాను చేసుకుంటే ఒత్తిడిని నియంత్రించ వచ్చునని, చేస్తున్న వృత్తిలో మంచి ఫలితాలు సాధించి సంతృప్తిని పొందవచ్చని అన్నారు. విద్యార్థి స్థాయి నుండి యోగ పై అవగాహన కలిగించి విద్యార్థులచే అభ్యాసం చేయిస్తే ఆరోగ్య భారతాన్ని సాధించవచ్చన్నారు. ఈనెల 19వ తేదీన పట్టిసీమలో పెద్దఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో సమాజంలో అన్ని వర్గాలు ప్రజలు భాగస్వాములు అయ్యి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యోగా లో భాగస్వాములు కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ ఓ దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్టీవో లక్ష్మీప్రసన్న, , డిపివో జి.మల్లిఖార్జున రావు, జిల్లా ఆయుష్ అధికారి బి.భాస్కర్, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ భానుప్రతాప్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఆర్డిఏ పీడీ విజయలక్షి, తహసీల్దార్ గాయత్రీదేవి, మెప్మా పీడీ రాజబాబు, ఇంచార్జ్ డిఎస్ ఓ ప్రతాప్, పౌర సరఫరాల శాఖ జీఎం శివరామమూర్తి, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, వివిధ శాఖలు విద్యార్థినీ విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారరు.