*అభ్యుదయ రైతులకు (Indi Gap) సర్టిఫికెట్లు అందజేత*
మండలంలోని ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ సబ్ డివిజన్ ఎలమంచిలి పరిధిలో ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారులతో పాటు రైతు సేవా కేంద్ర సిబ్బంది మరియు ఎరువుల డీలర్లు దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యవసాయ అధికారి ఎం ఆశా దేవి వారి ఆధ్వర్యంలో ఎరువుల సమగ్ర యాజమాన్యం రానున్న ఖరీఫ్ సీజన్లో దృష్టిలో పెట్టుకొని ఏపీ ఏఐఎంఎస్ పోర్టల్ ద్వారా రైతులకు ఆధార్ నెంబర్ను అనుసరించి గత ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలను బట్టి మరియు పంటల సరళని బట్టి ముఖ్యంగా యూరియా మరియు డిఏపి, ఎరువులను రైతులకు సరఫరా చేయడానికి వాటి యొక్క విధి విధానాలు ఆర్ ఎస్ కే సిబ్బందితో పాటు ఎరువుల డీలర్లకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఈ విధానంలో ఎటువంటి అవకతవకలు జరిగినయెడల ఆర్ఎస్ కే సిబ్బందితో పాటు ఎరువుల డీలర్ల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా వ్యవసాయ అధికారి ఎం ఆశా దేవి గారు రైతులకు విరివిగా అవగాహన కలిగించాలని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండలంలో గత రబీ పంట కాలములో indi Gap సర్టిఫికెట్స్ ఉద్దేశించి అభ్యుదయ రైతులకు సర్టిఫికెట్లు జారీ చేసి ఉన్నారు . వీరిలో రామారాయుడుపాలెం నుంచి బెజవాడ చిరంజీవి మరియు గొర్లె బాబురావు మల్ల బాబురావు కి సర్టిఫికెట్లు అందజేశారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సబ్ డివిజన్ ఎలమంచిలి మరియు పాయకరావుపేట సుమంత ప్రసాదు మరియు మండల వ్యవసాయ అధికారులు ఎలమంచిలి అచ్యుతాపురం మోహన్ రావు శంకర్ గోవిందు తో పాటు ఎరువుల డీలర్లు మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు ఆర్ఎస్ కే సిబ్బంది పాల్గొన్నారు