యలమంచిలి డివిజన్‌లో నేటి నుండి 'రైతన్న మీ కోసం' కార్యక్రమం
22/June/2026 19:53
Share:
యలమంచిలి డివిజన్,నాలుగు మండలాల్లో 22-06-2026నుండి27-06-2026 వరకు రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల క్షేత్ర సిబ్బంది ప్రతి గ్రామంలో రైతులను కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించిన కరపత్రాలు ఇచ్చి ఈ క్రింది ఆంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. 1. ఎల్ నినో సంసిద్ధత మరియు దాని ప్రభావాన్ని తగ్గించే చర్యలు 2. APAIMS ద్వారా ఆన్‌లైన్ ఎరువుల పంపిణీ విధానం మరియు సమతుల్య ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు 3. ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు హామీతో కూడిన రాబడి కోసం పంటల వైవిధ్యీకరణ. 4. ప్రకృతి వ్యవసాయం-పి.యం.డి.యస్ విత్తనాల సాగు పై కార్యక్రమంలో భాగంగా రాంబిల్లి మండలం పంచదార్ల,మామిడివాడ గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి సి. సుమంత ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఏ.ఈ.ఓ.దేముడు,గ్రామ స్థాయి వ్యవసాయ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.