రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి విజ్ఞాన కేంద్రాల. కృషి..
05/February/2026 16:48
Share:
రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి విజ్ఞాన కేంద్రాల కృషి.. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివ నారాయణ. గంటా గోవింద్. ఎడిటర్, ప్రకృతి వ్యవసాయం. కొండెంపూడి,(పకృతి వ్యవసాయం.) కే.వీ.కే ద్వారా రైతులకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, శిక్షణలు, విస్తరణ కార్యకలాపాలను ఆయన సమీక్షించారు. కే.వీ.కే శాస్త్రవేత్తలు చేపడుతున్న పరిశీలన క్షేత్రాలు (OFTs), ప్రథమ శ్రేణి క్షేత్రాలు (FLDs), రైతు శిక్షణా కార్యక్రమాలు పరిశీలించి, రైతులకు అందుతున్న సాంకేతిక సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విశాఖపట్నం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఇన్‌పుట్ డీలర్లకు నిర్వహిస్తున్న సమాజ్ర పోషక యజమాన్యం శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న శిక్షణార్థులతో ఆయన ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా డా. శివనారాయణ గారు మాట్లాడుతూ, ఇన్‌పుట్ డీలర్లు రైతులకు ముఖ్య సమాచార వనరులుగా వ్యవహరిస్తున్నందున, ఎరువులు, పురుగుమందులు, శిలీంద్రనాశకాలను సమర్థవంతంగా, మితంగా ఉపయోగించే విధంగా రైతులకు సలహాలు ఇవ్వాలని సూచించారు. అధిక వినియోగం వల్ల పర్యావరణం, నేల ఆరోగ్యం, రైతుల ఆదాయం దెబ్బతింటాయని హెచ్చరించారు. తదుపరి కే.వీ.కే ద్వారా నిర్వహిస్తున్న పరిశీలన క్షేత్రాలు మరియు ప్రథమ శ్రేణి క్షేత్రాలు, చిరు సంచులు సంబంధించిన రైతుల పొలాలను సందర్శించి, అక్కడ అమలవుతున్న సాంకేతికతలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి, వారి అనుభవాలను తెలుసుకుని, కే.వీ.కే చేపడుతున్న కార్యక్రమాలు రైతుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం రాజశేఖర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కిషోర్ కుమార్,ఇన్‌పుట్ డీలర్లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు