ఏలూరులో అట్టహాసంగా టిడ్కో డీడీల రీఫండ్ కార్యక్రమం.. లబ్ధిదారులకు రూ.35 వేల చెక్కుల పంపిణీ.

ఏలూరులో అట్టహాసంగా టిడ్కో డీడీల రీఫండ్ కార్యక్రమం.. లబ్ధిదారులకు రూ.35 వేల చెక్కుల పంపిణీ.

04/June/2026 16:31    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు 

సకల సదుపాయాలతో టిడ్కో ఇళ్ళు సిద్ధమవుతాయని కోటి ఆశలతో ఎదురు చూసిన లబ్దిదారులకు గత వైసిపి ప్రభుత్వంలో నిరాశే ఎదురైందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.పేదల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోని గత వైసిపి ప్రభుత్వ లెక్కలేనితనానికి అదే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడ్కో గృహాల కోసం గతంలో డిడిల రూపంలో 35వేల రూపాయలు కట్టిన వారికి ఆ సొమ్ములను తిరిగి వెనక్కి చెల్లించే కార్యక్రమాన్ని బుధవారం స్థానిక కండ్రికగూడెంలోని ఒక ఫంక్షన్‌ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, ఆర్టీసి విజయవాడ జోన్‌-2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, బీజేపి జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్‌ కిషోర్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా 14వందల 96 మంది టిడ్కో ఇళ్ళ లబ్దిదారులకు 6కోట్ల, 23లక్షల, 29వేల రూపాయల విలువైన మెగా చెక్కును అందించీ, వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగానే 7గురు లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసి మిగిలిన వారి ఖాతాల్లో వారి సొమ్ము జమ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పారదర్శకత, జవాబుదారీ విధానాలతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. అందుకు తార్కాణమే గత వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా టిడ్కో ఇళ్ళు రద్దైన లబ్దిదారులందరికీ వారు డిడిల రూపంలో చెల్లించిన నగదును తిరిగి చెల్లించడమని వ్యాఖ్యానించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత వైసిపి ప్రభుత్వ హయాంలో మొత్తం 4272 టిడ్కో ఇళ్ళు రద్దైయ్యాయని, దీంతో లబ్దిదారులు చెల్లించిన 14కోట్ల, 89లక్షల, 87వేల రూపాయల డిడి సొమ్ములను వెనక్కి తిరిగి చెల్లించే బాధ్యతను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. దాంట్లో భాగంగానే తాజాగా 6కోట్ల రూపాయలను లబ్దిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమచేశామన్న ఆయన,,, వీరందరికీ భవిష్యత్తులో 2లక్షల, 50వేల రూపాయలతో ఇళ్ళు కట్టించి ఇచ్చే బాధ్యతను మరింత వేగవంతం చేయనున్నట్లు ప్రజలు, లబ్దిదారుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టే విధంగా కూటమికి ప్రజలంతా ముక్తకంఠంతో జై కొట్టాలంటూ ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. నగర మేయర్‌ నూర్జహాన్‌, ఆర్టీసి జోన్‌ చైర్మన్‌ అప్పలనాయుడు, బీజేపి జిల్లా అధ్యక్షులు విక్రమ్‌ కిషోర్‌లు మాట్లాడుతూ పేదలకు ఆర్ధిక మేళ్ళు చేకూర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా ముందుకెళ్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఏపి మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, డిప్యూటీ మేయర్‌ కర్రి శ్రీనివాస్‌, టిడిపి జిల్లా మీడియా కో-ఆర్డినేటర్‌ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, బీజేపి నాయకులు గాది రాంబాబు, తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు,టిడిపి సీనియర్‌ నాయకులు బెల్లపుకొండ కిషోర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌, కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, మాజీ డిప్యూటి మేయర్‌ పప్పు ఉమా, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జీలు, డివిజన్ ఇంచార్జిలు, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter