తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు ఫైర్..
30/May/2026 18:04
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
పబ్లిసిటీ కోసమే తెలంగాణ ఎమ్మెల్యేలు మా అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పై విమర్శలు చేస్తున్నారని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిపై హైదరాబాద్ కేంద్రంగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలను ఏలూరు జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి ఆపద వచ్చినా, కోట్లాది రూపాయలు విరాళాలు అందిస్తూ, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాంటి వ్యక్తిపై కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విశ్లేషకులు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గౌరవిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయని అనేక సందర్భాల్లోను గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలు రాజకీయ అంశాలపై విమర్శలు సహజమేనని, అయితే వ్యక్తిగత దూషణలు చేయడం, ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నదమ్ముల పరస్పర గౌరవం, సోదర భావంతో కలిసి ముందుకు సాగాలని, రెండు తెలుగు రాష్ట్రాల ఐక్యతకు ప్రతీకగా నిలవాలని, ఆయన ఆకాంక్షించారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రతి ఒక్కరు ఖండించాలని, సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు, అందరూ బాధ్యతయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని తెలిపారు. జనసేనకు తెలంగాణలో క్రేజ్ పెరుగుతుందన్న భయంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పై కూడా కేసులు వద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్షమాపణ చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో భావప్రకటన, స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ, వ్యక్తిగత దూషణలు అవమానకర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. జరిగిన విషయాలకు, వాస్తవాలకు మించి ఊహగానాలు జోడించి, ప్రచారం చేయడం బాధ్యత రాహిత్యమని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు, అనవసర వ్యాఖ్యలతో సమాజంలో విభేదాలు సృష్టించకూడదని రెడ్డి అప్పలనాయుడు అప్పల నాయుడు మండిపడ్డారు. భవిష్యత్తులో తెలంగాణలో జనసేన పార్టీకి మరింత బలం పెరిగి, ప్రజల్లో విశ్వాసం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాదులో పవన్ కళ్యాణ్ గారిని అడుగుపెట్టనీయమంటు మాట్లాడుతున్న వారిని ఉద్దేశించి, జనసేన పార్టీ తెలంగాణ గడ్డపై ఆవిర్భవించిందని పవన్ కళ్యాణ్ ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. సమాజంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకొని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, నూకల సాయి, కొండల ప్రసాద్, జనసేన రవి, పెరుమాళ్ళ జనార్థన్ రావు, 1టౌన్ మహిళ కార్యదర్శి వెలగా గాయత్రీ తదితరులు పాల్గొన్నారు..