500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సత్కారం..!!

500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సత్కారం..!!

27/May/2026 16:01    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివి సూర్య ప్రకాష్ :
 
రాంబిల్లి మండలం గోకివాడ గ్రామంలో మంగళవారం (26-05-2026) గోకివాడ పంచాయతీ పరిధిలో పదో తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన 8 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మాస్టర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద వెంకట సూర్యనారాయణ చేతుల మీదుగా విద్యార్థులకు మెడల్స్, మెమెంటోలు, శాలువాలు అందజేసి, ఒక్కొక్కరికి రూ.1000 ప్రైజ్ మనీ అందించారు.
 
ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో థర్డ్ ర్యాంక్ సాధించిన పక్కుర్తి తారకేష్ 591 మార్కులు పొందడం, అతను గోకివాడ పంచాయతీకి చెందిన విద్యార్థి కావడం గ్రామానికి గర్వకారణమని పలువురు అభినందించారు.
 
కార్యక్రమంలో ఎంపీటీసీ అల్లవరపు బాబ్జీ, దిమిలి బ్యాంకు ప్రెసిడెంట్ పొట్నూరు శివశంకర్, గ్రామ పెద్దలు సేనాపతి సూరిబాబు, గోవిందరావు, నందవరపు రాఘవరావు పాల్గొన్నారు. అలాగే మాస్టర్ యూత్ సభ్యులు డి. నాగేశ్వరరావు, కిరణ్, శ్రీను, వెంకట అప్పారావు, నరేష్, భాస్కర్ తదితరులు హాజరయ్యారు.
అదేవిధంగా గోకివాడ గ్రామానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ సైనికుడు ఎస్. కొండలరావును కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
Breaking News

Subscribe our Newsletter