యలమంచిలి శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు వేడుకలు

యలమంచిలి శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు వేడుకలు

06/June/2026 16:25    Share:   

క్రైమ్ అనాల్సిస్ |టివియస్ ప్రకాష్ :
యలమంచిలి శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన "వేసవి విజ్ఞాన శిబిరం" ముగింపు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. శిబిరం సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించగా, విజేతలకు ముగింపు కార్యక్రమంలో బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ కలెక్టర్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కుమారుడు, రిటైర్డ్ ఖాదీ బోర్డు డైరెక్టర్ ఎస్. జవహర్, కుమారి అనురాధ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమానికి రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ ఆడారి పూరీ జగన్నాథ్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా వై. అప్పారావు, సోమాయాజులు, సన్యాసిబాబు, కె. అక్కిశెట్టి, పి. ప్రకాష్, కె. దుర్గారావు (ఫిజికల్ డైరెక్టర్) తదితరులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
పెద్దలు మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఆదివారం నిర్వహించే "చదవటం మాకు ఇష్టం" కార్యక్రమంలో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రంథాలయాధికారి వి. ఆనంద్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయ సభ్యత్వం తీసుకుని విలువైన పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లి చదవాలని, గ్రంథాలయంలో ఉన్న విజ్ఞానభరితమైన పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
చివరగా విజేతలకు బహుమతులు అందజేయగా, కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter