డైట్ లో “ఐసి-పినాకా 2026” సదస్సు

డైట్ లో “ఐసి-పినాకా 2026” సదస్సు

23/February/2026 15:12    Share:   

భవిష్యత్తును తీర్చిదిద్దే విభాగాలు హై కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  - విశ్వేస్ జటాల 
దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, అటానమస్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు “ఐసి-పినాకా 2026”  రెండు రోజుల సదస్సు ఘనంగా ప్రారంభమైంది. 
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విశ్వేస్ జటాల, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటి భిలాయ్, వర్చువల్ పద్ధతిలో హాజరయ్యి విద్యార్థులకు హై కంప్యూటింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ కోసం సంక్షిప్తంగా వివరించారు.విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందించారు. తొలి రోజు వివిధ సాంకేతిక సెషన్లలో విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను ప్రదర్శించారు. సెషన్లో  వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ ప్రాజెక్టులను సమర్పించి అధ్యాపకుల ప్రశంసలు అందుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ అంశాలపై వారు చేసిన పరిశోధనలు  పాల్గొన్న వారిని  ఆకట్టుకున్నాయి
బి.టెక్ చివరి సంవత్సరం విద్యార్థులు పేపర్ ప్రెజెంటేషన్లు నిర్వహించారు. డేటా సైన్స్ మరియు ఆధునిక సాంకేతికతలకు సంబంధించిన వారి విశ్లేషణలు సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. వైకుంఠరావు మాట్లాడుతూ సాంకేతిక రంగంలో జరుగుతున్న తాజా మార్పులను తెలుసుకోవడానికి ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పిస్తాయని తెలిపారు. సి ఎస్ డి ఎమ్
విభాగాధిపతి డా. ఏ.ఎస్.ఎల్.కే. గోపాలమ్మ మాట్లాడుతూ పరిశోధనాత్మక దృక్పథం విద్యార్థుల్లో పెంపొందించుకోవడం ఎంతో అవసరమని, ఇలాంటి వేదికలు వారి ప్రతిభను ప్రదర్శించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని సాంకేతిక అంశాలపై చర్చలు జరిపారు. సాంకేతిక రంగంలో తాజా అభివృద్ధులపై అవగాహన పెంపొందించుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter