ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళ హాస్టల్స్ ను ఏర్పాటుకై ఏఐఎస్ఎఫ్ రిలే నిరాహార దీక్షలు
25/February/2026 06:54
Share:
యలమంచిలి : అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళ హాస్టల్స్ ను ఏర్పాటుకై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు చేసే రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని యలమంచిలి ఎస్సీ బాయ్స్ హాస్టల్ వద్ద గోడ పత్రికలను విడుదల చేయడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. ఫణీంద్ర కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రభుత్వ హాస్టల్స్ ను ఏర్పాటు చేయమని అనేకసార్లు సంబంధిత అధికారులు విన్నవించిన ఎటువంటి స్పందన లేదని అన్నారు. అనకాపల్లి నూతన జిల్లాగా ఏర్పడి రెండు సంవత్సరాలు అయినా ఇప్పటివరకు మహిళలకు సరైన వసతి గృహం లేకపోవడం దారుణమని తెలిపారు. అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ లో వార్డెన్, కుక్, కామాటి, వాచ్మెన్ పోస్ట్లు బట్టి చేయకపోవడం వల్ల విద్యార్థులకు సరైన పర్యవేక్షణ లోపించిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ సంక్షేమస్య విద్యార్థులకు పెరుగుతున్న ధరకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, గిరిజన వసతి గృహాల్లో వర్కర్స్ ని శాంక్షన్ పోస్టుల ద్వారా భర్తీ చేసి ప్రభుత్వమే వారికి జీతాలు చెల్లించాలని అన్నారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, పిపిపి విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనని విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అనకాపల్లి జిల్లా కేంద్రంలో చేసే రిలే నిరాహార దీక్షలలో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని యలమంచిలి ఎస్సీ బాయ్స్ హాస్టల్ వద్ద గోడపత్రికను విడుదల చేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మణికంఠ, అజయ్, లక్ష్మణ్, అనిల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.