టమాట రైతు కంటతడి

టమాట రైతు కంటతడి

27/February/2026 08:28    Share:   

అనకాపల్లిలో టమాట పండించిన రైతులు కంటతడి పెడుతున్నారు. ఎంతో కష్టపడి పండించినటువంటి పంట 30 కేజీల టమాట 200 రూపాయలకు అమ్ముకోవలసి వస్తుంది ఆటో ఖర్చులు పోను 170 రూపాయలు 30 కేజీలు టమాటాకు రైతుకు మిగులుతుంది. పండిన పంట దాచుకోవడానికి ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయకపోవడం వల్ల ఎంతో కష్టపడి పండించిన పట్టా తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. కోల్డ్ స్టోరేజ్ ఉండేటట్టు అయితే అమ్మగా మిగిలిన పంటను అందులో దాచుకొని తరువాత అమ్ముకొని వాళ్ళము. రైతు బజారు ఉంటే గిట్టుబాటు ధర వచ్చేది అదిగో రైతు బజారు ఇదిగో రైతు బజార్ అంటున్నారు తప్ప రైతు బజార్ ప్రారంభించడానికి అధికారులకు నాయకులకు కాళీ లేదు. ఎన్నాళ్ళని అనకాపల్లి నాయకులు అధికారులు, ఎన్నాళ్ళని మమ్ములను బాధపడతారు. అనకాపల్లి జిల్లా అయినప్పటికీ రైతులకు ఒరిగేదేమీ లేదు ఇకనైనా తక్షణమే రైతు బజార్ ఏర్పాటు చేసి రైతుల బాధలు అర్థం చేసుకుంటారని అధికారులను నాయకులను కోరుతున్నాం.
Breaking News

Subscribe our Newsletter