పెద్దపల్లి గ్రామంలో శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవం
26/February/2026 20:54
Share:
యలమంచిలి: మున్సిపాలిటీ పరిధిలో పెదపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అతి భారీ దేవాలయం శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. దైవజ్ఞులు రైజేటి శ్రీరామాచార్యులు చేతుల మీదుగా ప్రతిష్ట కార్యక్రమం గురువారం నాడు అతి వైభవం నిర్వహించారు. ఈ ఆలయంలో గత మూడు రోజుల నుంచి ఇక్కడ కొలువుదీరనున్న దేవీ దేవతల విగ్రహాలకు సంప్రోక్షణ జలాధివాసం, క్షీరాదివాసం, ధాన్యాధివాసం నిర్వహించి, గ్రామాల్లో ఊరేగింపు చేసి, ఈ దేవతా మూర్తుల ప్రతిష్టతో పాటు పసిడి కలశం, ధ్వజస్తంభ ఆరోహణ ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు దాహార్తిని తీర్చే మజ్జిగ చలివేంద్రం పోతల బ్రదర్స్ ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టీటీడీ చైర్మన్ పప్పల చలపతిరావు, రాష్ట్ర రోడ్లు అభివృద్ధి శాఖ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు, జనసేన ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుందరపు సతీష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార, వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కరణం ధర్మశ్రీ, మనసాల భరత్, మునిసిపల్ చైర్ పర్సన్ పిల్లా రమాకుమారి, వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వరావు అర్రేపు గుప్తా, బోదిపు గోవిందు, కౌన్సిలర్లు దాసరి చిన్నమ్మలు, దుంగ అచ్చితరావు, గ్రామ పెద్దలు బొద్దపు ఎర్రయ్య దొర, దాసరి కుమార్, బొద్దపు శ్రీను, బొద్దపు నాగేశ్వరరావు, బొద్దపు రమణ, శివ, పప్పు ఈశ్వరరావు, కమిటీ వారు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.