ఆర్.సి.యమ్ చర్చి ఆధ్వర్యంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు.
03/April/2026 19:17
Share:
యలమంచిలి లో ఘనంగా గుడ్ ఫ్రైడే యలమంచిలి ఆర్ సి యం ఆధ్వర్యంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా మెయిన్ రోడ్డు నుండి సెంట్ మేరీ స్కూల్ వరకు యలమంచిలి క్యాథలిక్ చర్చి విశ్వాసులందరూ ఆనాడు ఏసుప్రభు ఏ విధంగా శ్రమలనిభవించారో అదేవిధంగా ప్రదర్శించారు. ప్రధానంగా ఏసుకు మరణ శిక్ష విధించడం సిలువ మోయటం సెలవు కింద పడటం జేసునాథుడు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పడం ఏసుప్రభు వస్త్రాలు తీసివేయటం సిలువ వేయటం తదితర 14 సన్నివేశాలను మెయిన్ రోడ్డు గుండా ప్రదర్శించారు. ఆనాడు జరిగినట్టుగా ప్రదర్శించడంతో ఇటు ప్రజలు ఎంతో ఆసక్తితో తిలకించారు ఏసు పాత్రలో, ఎస్.మోహన్ పిలాతు పాత్రలో, కే.మనోహర్ మరి కొంతమంది వివిధ పాత్రల్లో ప్రదర్శించారు. యలమంచిలి కేథరిక్ చర్చ్ ( ఆర్ సి యమ్) ఫాదర్ వెలగా బాలరాజు. సెంట్ మేరీస్ కరస్పాండెంట్ సిస్టర్ ఝాన్సీ ఆధ్వర్యంలో జరగ గా చర్చి పెద్దలు, విశ్వాసులు,ప్రజలు అధిక సంఖ్యలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.