జనసేన రాష్ట్ర వ్యాప్తంగా  క్రియా శీలక సభ్యత్వం నమోదు

జనసేన రాష్ట్ర వ్యాప్తంగా క్రియా శీలక సభ్యత్వం నమోదు

26/February/2026 07:19    Share:   

ఫిబ్రవరి 26 వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న క్రియా శీలక సభ్యత్వం నమోదు 
కొండల ప్రసాద్, CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ఏలూరులో క్రియా శీలక సభ్యత్వం నమోదు చేయించు వాలంటీర్లతో సన్నాహక సమావేశంలో ఏలూరు జిల్లా క్రియాశీలక పరిశీలకులు, పి.గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు వెల్లడి..
ఏలూరు పార్టీ కార్యాలయంలో జనసేన సాధక్ (క్రియాశీలక వాలంటీర్లు) టీంతో రెడ్డి అప్పల నాయుడు గారి ఆత్మీయ సమావేశం..
రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కాబోతున్న జనసేన ఉద్యమి క్రియా శీలక సభ్యత్వం నమోదు కార్యక్రమానికి సంబంధించి బుధవారం సాయంత్రం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ సాధక్ (క్రియాశీలక వాలంటీర్లు) టీంతో ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా క్రియాశీలక సభ్యత్వం పరిశీలకులు, గన్నవరం శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు,  నూజివీడు జనసేన ఇంచార్జీ బర్మా ఫణిబాబు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు, ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు గారు మాట్లాడుతూ జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ్యత్వ నమోదుకు రెండు కోట్లు విరాళాలు అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారని తెలిపారు. ఈనెల 26వ తేదీ నుండి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకు వచ్చే వారికి పార్టీ సభ్యత్వం ఇవ్వాలని ఆయన సూచించారు. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగించి వాటి సిద్ధాంతాలకు ఆకర్షితులు చేసి సభ్యత్వ నమోదు చేసే సాధకులు చురుకుగా పనిచేయాలని సూచించారు. పార్టీకి ప్రజలను మరింత చేరువచేసే ప్రముఖ పాత్ర సాధక్ టీమ్ చేస్తుందని వారి సేవలను కొనియాడుతూ, ఈ సమావేశంలో గడిచిన సంవత్సరం నియోజకవర్గం మొత్తం మీద జరిగిన సభ్యత్వాలను అధిగమించి రెట్టింపు సభ్యత్వాలు నమోదు అయ్యే విధంగా కృషి చేయాలని, సామాన్య ప్రజలను పార్టీకి మరింతా చేరువ చేసే విధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉండాలని, దాని కోసం క్రియా వాలంటీర్లకు అన్ని విధాలుగా సహకరించేలా నాయకులు కృషి చేసే విధంగా కార్యాచరణను రూపొందించి సమావేశంలో వివరించారు. ఈ సంవత్సరం మరింత ఉత్సావంతో నాయకులు, సాధక్ టీమ్ కృషి చేయాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ బోర్డు డైరెక్టర్ నల్లగోపుల వెంకట చలపతిరావు, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, కైకలూరు జనసేన నాయకులు కొల్లి బాబీ, కైకలూరు మండల అధ్యక్షులు నాగమల్లేశ్వర రావు, కైకలూరు జనసేన నాయకురాలు తోట లక్ష్మీ, దెందులూరు జనసేన నాయకురాలు కొఠారి లక్ష్మీ, జనసేన సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి గారు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, జనసేన ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నగర అధ్యక్షులు వీరంకి పండు, దెందులూరు జనసేన నాయకులు తాటిపూడి చందు, మేడిచర్ల కృష్ణ, చదరం విద్యాసాయి, క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించు వాలంటీర్లు (సాధక్) మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter