అఖిలభారత అంతర విశ్వవిద్యాలయాల టైక్వాండో పోటీలకు డైట్ విద్యార్థిని
26/February/2026 06:54
Share:
దాడి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ అటానమస్ కళాశాల విద్యార్థిని మూడో సంవత్సరం చదువుతున్న యు.జయశ్రీ, బి .టెక్, ఈ సి ఈ బ్రాంచ్. ఇటీవల జేఎన్టీయూ జీవి విశ్వవిద్యాలయ అంతర కళాశాల టైక్వాండో పోటీలలో సెలెక్ట్ అయినది. వచ్చే నెల మార్చి 16, 17 తేదీలలో ఫకీర్ మోహన్ యూనివర్సిటీ ఒడిశా, రాష్ట్రంలో జరుగు అఖిలభారత అంతర్ విశ్వవిద్యాలయ టైక్వాండో పోటీలలో పాల్గొన్నట్టు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ బి సి హెచ్ శ్రీనివాసరావు తెలిపారు .పై పోటీలకు తమ కళాశాల విద్యార్థిని ఎంపిక కావడం పట్ల కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ గారు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు గారు మరియు కళాశాల అధ్యాపక ఆధ్యాపకేతర సిబ్బంది హర్షం తెలిపారు.