దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధునిక బోధన మరియు వినూత్న కౌన్సిలింగ్ వ్యూహాలు పై అవగాహన
15/February/2026 10:13
Share:
డైట్ లో “ఆధునిక బోధన మరియు వినూత్న కౌన్సిలింగ్ వ్యూహాలు” అవగాహన సదస్సు దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ , అటానమస్ కళాశాల లో ఆధునిక బోధన మరియు వినూత్న కౌన్సిలింగ్ వ్యూహాలు అనే అంశం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు రిసోర్సు పర్సన్ గా డాక్టర్. వల్లభనేని మధుసూదన్ రావు గారు, రెక్టర్, వి ఐ ఐ టి, విశాఖపట్నం, హాజరయ్యారు. మధుసూదన్ ఉపన్యాసంలో ఆధునిక బోధనా విధానాల ప్రాముఖ్యతను వివరించి, డిజిటల్ యుగంలో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధనలో సాంకేతికత వినియోగం, ఔట్ అఫ్ బాక్స్ టీచింగ్ , అనుభవాత్మక అభ్యాసం వంటి అంశాలను వివరించారు. అలాగే విద్యార్థులు మరియు అధ్యాపకుల మధ్య భావోద్వేగ స్థైర్యం, కెరీర్ మార్గదర్శకత్వం మరియు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన వినూత్న కౌన్సెలింగ్ వ్యూహాల పై డైట్ అధ్యాపకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దాడి గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యూషన్ శ్రీ దాడి రత్నాకర్ గారి ప్రోత్సాహంతో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఆర్ వైకుంఠ రావు గారి మార్గదర్శకత్వంలో మరియు డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి వెంకట ఫణిబాబు, అసోసియేట్ డీన్ అడ్మినిస్ట్రేషన్ ఎమ్.పద్మాకర్, నిర్వహించబడింది. వారు విద్యా రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో సంస్థ ఎల్లప్పుడూ ముందంజలో కట్టుబడి ఉంటుందని అలాగే నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులకు అందజేయడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బోధన ,సిబ్బంది టెక్నీషియన్ ,ప్రోగ్రామర్లు ,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.