తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా సిపిఎం యలమంచిలి ఉపాధిహామీ చట్టాన్ని మార్చొద్దని అచ్చుతాపురం తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఉప తహసిల్దార్ కి వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కే రామ సదాశివరావు, అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు తగ్గేలా కేంద్ర బడ్జెట్ కేటాయింపులున్నాయని. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 125 పని దినాలు కల్పిస్తామని చెప్పి, వంద రోజులు పనికి సరిపడా నిధులు కేటాయించలేదని125 రోజులు పని కల్పించాలంటే లక్ష 30 వేల కోట్లకు పైగా కేటాయించాలి. కానీ 90 వేల కోట్లు కేటాయించింది. కొత్తగా తీసుకొచ్చిన విబిజి రామ్ జి పథకం ప్రకారం ఈ కేటాయింపుల్లో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఖర్చు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రకారం నిధులు ఖర్చు చేయకపోతే కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన 60 శాతం నిధులు విడుదల చేయదు. దీంతో కూలీలకు పని దినాలు తగ్గడంతో పాటు పనిచేసిన రోజులకు కూలి అందని పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్రం కేటాయింపులు ప్రకారం రూ. 6,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. ఉపాధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు తగ్గిస్తే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోనున్నాయి. కూలీలకు తీవ్ర నష్టం కలిగించే విబిజి రామ్ జి పథకాన్ని రద్దుచేసి, కూలీలకు మేలుచేసే గతంలో ఉన్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి. కూలీల అవసరాలకు సరిపడా పనులు కల్పించేలా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు కర్రి. అప్పారావు మండల కమిటీ ఉపాధి కూలీలు మడగల.కాసుబాబు, బత్తిన. తాతయ్య,కర్రి.వీరు నాయుడు, కడారి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.