అనకాపల్లి ట్రాఫిక్ సిబ్బందికి. క్యాప్స్, గాగుల్స్,మాస్క్ ల పంపిణీ
12/March/2026 07:57
Share:
అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. నారాయణ గారు రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి డ్యూటీ సమయంలో ఉపయోగపడే ట్రాఫిక్ డ్యూటీ సమయంలో ఉపయోగపడే ట్రాఫిక్ డ్యూటీ క్యాప్స్, ఎండలో కళ్లను రక్షించే గాగుల్స్ మరియు మాస్క్‌లను అందజేశారు. వేసవిలో తీవ్రమైన ఎండలో కూడా నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సామగ్రిని పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది విధుల్లో జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.