బాలలపై సోషల్ మీడియా ప్రభావం - తల్లిదండ్రులు, సమాజం బాధ్యత..!
26/May/2026 07:02
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్. శ్రీ లక్ష్మి ప్రపంచ తప్పిపోయిన పిల్లల దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ప్రాంగణంలోని ఎం.పీ.డీ.వో., సమావేశ మందిరము నందు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఇన్ స్టాగ్రామ్, సోషల్ మీడియా ప్రభావం బాలలపై ఎక్కువగా ఉందని, తల్లిదండ్రులు నిరంతర పర్యవేక్షణలో బాలలను పెంచాలని, అవసరమైన తప్పని పరిస్థితులలో మాత్రమే విద్యార్థులకు చర్వావాణీలను అందుబాటులో ఉంచాలని, అది తల్లిదండ్రుల ఆధ్వర్యంలో మాత్రమే ఉపయోగించేలా చూడాలని సూచించారు. బాలలు క్షణికావేశంలో ఇంటి నుండి వెళ్లిపోవడం, అలా ఒంటరి పిల్లలను సంఘ విద్రోహ శక్తులు మాయమాటలతో అక్రమ రవాణాకు పాల్పడడం జరుగుతుందని, ఇది సమాజంపై దుష్ప్రభావాలు చూపిస్తాయని కావున అధికారులతో పాటు ప్రజలు సహకారంతో ఈ సమస్య నుండి బయటపడవచ్చు అని సూచించారు ఉమ్మడి కుటుంబాలు చెల్లాచేదుర అవడం, బాలలు పెద్దల నుండి క్రమశిక్షణ నేర్చుకోకపోవడం వల్ల ఇటువంటివి తరచుగా జరుగుతున్నాయని కావున అందరూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే అపరిచితులు మరియు అనుమానితుల నుండి బాలలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అవసరమైన పక్షంలో 15100 ద్వారా న్యాయ సహాయని పొందాలని సూచించారు. మరియు కార్యక్రమంలో ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల బాలల సంరక్షణ అధికారులు శ్రీమతి సూర్య చక్రవేణి, ఆర్ రాజేష్ కుమార్, ఉమెన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, సిడబ్ల్యుసి ఇన్చార్జ్ చైర్పర్సన్ పి. వెంకటేశ్వరరావు, ఎల్ ఎస్ కోఆర్డినేటర్ భాస్కరరావు సిడిపిఓ తులసి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.