అనకాపల్లి మార్చి 17 నుండి,ఏప్రిల్ 17 వరకు శ్రీ నూకంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు
17/March/2026 18:39
Share:
మార్చి 17 నుండి,ఏప్రిల్ 17 వరకు శ్రీ నూకంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు సామాన్య భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీల దర్శనాలకై ఏర్పాట్లు పూర్తి * స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ* అనకాపల్లి మార్చి 16 : శ్రీ నూకంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు మార్చి 17 నుండి ఏప్రిల్ 17 వరకు జరగనున్నందున పటిష్టమైనఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర పండగ గుర్తింపు పొందిన గవరపాలెంలో వెలిసిన ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల ఏర్పాట్లను గురించి సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను (గొల్ల బాబు), ఆలయ కార్య నిర్వహణ అధికారి యాళ్ళ శ్రీధర్ తో కలసి వివిధ జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర, కొత్త అమావాస్య, ఉగాది మహోత్సవాలకై భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసామని తెలియజేశారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీల దర్శనాలకై ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. క్యూలైన్ల ఏర్పాటు, చలవా పందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు దృష్టి ఉంచుకొని క్యూలైన్ లో ఉండే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, చిన్నపిల్లలకు పాలు సరఫరా చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు వాహనాలకు పార్కింగ్ సదుపాయం, భక్తులకు అసౌకర్యం కలగకుండా సరిపడా క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య శిబిరాలు ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించామని తెలిపారు. దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను (గొల్ల బాబు) మాట్లాడుతూ ఈనెల 17, నుండి వచ్చేనెల 17 వరకు నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, జాతర, కొత్త అమావాస్య కు ఆలయానికి వచ్చే భక్తులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలియజేశారు.ఈ ఏడాది భారీ విద్యుత్ అలంకరణ, స్టేజ్ ప్రోగ్రామ్, నేల వేషాలు తదితర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని, అదే విధంగా మెడికల్, ఫైర్, జీవీఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని అని తెలియజేశారు. నూకాంబిక అమ్మవారి జాతర సందర్భంగా APSRTC అనకాపల్లి జిల్లాకు రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నట్లుగా తెలియజేశారు విశాఖపట్నం నుండి 5 బస్సులు, చోడవరం/మాడుగుల నుండి 3 బస్సులు, సబ్బవరం/విజయనగరం నుండి- 3, నర్సీపట్నం నుండి- 2, పాయకరావుపేట నుండి - 2, దేవరపల్లి నుండి- 1, అచ్యుతాపురం నుండి - 2 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా తెలియజేశారు. ఈ సమావేశంలో ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత, ఆలయ ఈవో శ్రీధర్, పోలీస్, జీవీఎంసీ, ఫైర్ సర్వీస్, విద్యుత్ శాఖ, డిఎం అండ్ హెచ్ ఓ, విభాగాల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.