దెందులూరు, మార్చి 16 (ca news) దెందులూరు మండలంలో 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని కొవ్వలి దెందులూరు గోపన్నపాలెంలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు .ఆయా పరీక్ష కేంద్రాల్లో 700 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు.ఉదయం 8గంటలకే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. తమ హాల్ టికెట్ నెంబర్లను సరిచూసుకొని, అనంతరం పరీక్ష గదులకు చేరారు. కేంద్రాల వద్ద సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపించారు. మొదటిరోజు కావడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పరీక్ష కేంద్రాలకు వచ్చారు.