దివ్యాంగుడి సైకిల్ యాత్ర..

దివ్యాంగుడి సైకిల్ యాత్ర..

14/March/2026 21:02    Share:   

- మద్దతు తెలిపిన రాష్ట్ర కార్యదర్శి రంగనాయకులు
రాంబిల్లి : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం, కనికం మండలం బూర్గం గ్రామానికి చెందిన దివ్యాంకుడైన నెయ్యుల ప్రసాద్ సంకల్పం, స్వామి పై భక్తి, పార్టీపై విధేయత, నాయకుడు పై అభిమానం వీటి ముందు తనకున్న శారీరక లోపం చిన్నబోయింది.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సుభిక్షంగా ఉంటారని, తన దివ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా తిరుపతి వరకు పాదయాత్ర చేస్తానని ఏడుకొండల స్వామి వారికి మొక్కుకొని, తర్వాత మొక్కవోని పట్టుదలతో, మొక్కుతీర్చుకొనుటకు సైకిల్ యాత్ర చేపట్టి సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించారు. యాత్ర రాంబిల్లి మండలం, హరిపురం కు చేరుకొనగా రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ధూళి రంగనాయుకులు నెయ్యిల ప్రసాద్ కి స్వాగతం పలికి సన్మానం చేసి, అభినందించి తగు ఆర్ధిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిల్లాడి శ్రీను, పార్టీ ప్రధాన కార్యదర్శి దేవర శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయుకులు ధూళి పరమేష్, ఐటీడీపి ధూళి నూకరాజు, జోగా లోవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter