16వ సారి ఓవరాల్ ఛాంపియన్‌గా ఆంధ్ర మెడికల్ కాలేజీ రికార్డు ..
07/May/2026 20:58
Share:
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - యలమంచిలి : వైద్య విద్యలోనే కాకుండా క్రీడల్లోనూ తమకు సాటిలేరని విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ (AMC) విద్యార్థులు మరోసారి నిరూపించారు. డా. ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో నిర్వహించిన ఏపీ స్టేట్ మెడికల్ & డెంటల్ ఇంటర్-కాలేజియేట్ స్పోర్ట్స్ మీట్‌లో ఆంధ్ర మెడికల్ కాలేజీ పురుషుల, మహిళల అథ్లెటిక్స్ జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచాయి.ఈ పోటీల్లో పురుషుల, మహిళల విభాగాల్లో వరుసగా 16వ సారి ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించి చరిత్ర సృష్టించాయి. ఈ విజయంతో కళాశాలకు మరో గౌరవం తీసుకొచ్చాయి.ఈ సందర్భంగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. కె.వి.ఎస్.ఎం. సంధ్యా దేవి జట్లకు ట్రాక్ సూట్లు అందజేశారు. ఆమె స్వంత నిధుల నుంచి రూ.35,000 విలువైన ట్రాక్ సూట్లను విరాళంగా అందించి, 19 మంది జట్టు సభ్యులకు ప్రోత్సాహకంగా బహూకరించారు.విద్యార్థుల అంకితభావం, క్రమశిక్షణ, జట్టు స్పూర్తిని ప్రిన్సిపాల్ అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ డా. ఎం.ఎస్.ఎన్. పాత్రుడు, స్పోర్ట్స్ సెక్రటరీలు జి. నేతాజీ, వై. తోషిత, స్టూడెంట్ జనరల్ సెక్రటరీ బి. ఆదిత్య రెడ్డి, కల్చరల్ సెక్రటరీ పి. చరణ్ తదితరులు పాల్గొన్నారు.