అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా సిఐటియు నివాళి

అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా సిఐటియు నివాళి

07/May/2026 14:12    Share:   

మోసయ్యపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఉపాధ్యాయులు ధోని నూకరాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్. రాము, కన్వీనర్ కె. నాయుడు మాట్లాడుతూ –

  • బ్రిటిష్ పాలకులను గడగడలాడించి స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు నేటి యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.

  • అల్లూరి బాటలో యువత ఐక్యమై విద్య, ఉపాధి, ఆరోగ్యం అందరి హక్కు అనే నినాదంతో ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు.

  • నేటి పాలకులు అవలంబిస్తున్న విధానాల వలన రాజ్యాంగ హక్కులు, కార్మిక హక్కులు హరించబడుతున్నాయని, బహుళజాతి సంస్థలకు ప్రజల శ్రమను ప్రైవేట్ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారని విమర్శించారు.

  • అల్లూరి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని, కార్మిక హక్కులను కాపాడుకోవడానికి మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు మెరుగు రాజేష్, దుర్గాప్రసాద్, ఆడారి సునీల్ కుమార్, పూడి బాల గణేష్, మహిళలు సత్యవతి, వెంకటలక్ష్మి, పట్నాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Breaking News

Subscribe our Newsletter