ఏలూరు జిల్లాలో కోకో నర్సరీల అభివృద్ధి, అధిక దిగుబడి సాధన కోసం ప్రత్యేక పరిశీలన కార్యక్రమం..
04/May/2026 21:39
Share:
కోకో నర్సరీల అభివృద్ధి, అధిక దిగుబడి కి చర్యలు కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు, ఏలూరు జిల్లాలో కోకో నర్సరీల అభివృద్ధి, అధిక దిగుబడి సాధన కోసం ప్రత్యేక పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఉద్యానవన శాఖాధికారి షాజా నాయక్ చెప్పారు. . ఈ కార్యక్రమంలో భాగంగా Central Plantation Crops Research Institute (CPCRI) శాస్త్రవేత్తలు పాల్గొని జిల్లాలోని పలు నర్సరీలను సోమవారం సందర్శించారు. మొదటగా జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామానికి చెందిన శ్రీ రామాంజనేయ రెడ్డి గారి నర్సరీని శాస్త్రవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీ నిర్వహణలో అనుసరించవలసిన శాస్త్రీయ పద్ధతులు, ముఖ్యంగా అధిక దిగుబడి ఇచ్చే తల్లి మొక్కలను (Mother Plants) ఎంపిక చేసే విధానం, వాటి నుండి నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేసే సాంకేతికతలను శాస్త్రవేత్తలతో కలిసి షాజా నాయక్ రైతులకు వివరించారు. అలాగే కత్తిరంపుల (Cuttings) ద్వారా నర్సరీ పెంపకం విధానాన్ని ప్రదర్శనాత్మకంగా చూపించి, రైతులకు అవగాహన కల్పించారు. తదుపరి, CPCRI ద్వారా రైతులకు అందించబడిన తల్లి కోకో మొక్కలను (Poly Clonal Gardens) శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీటిలో కామవరపుకోట మండలానికి చెందిన గూడూరి శ్రీదేవి గారీ కోకో తోట, పెదవేగి మండలంలో ఉన్న పులగం సుబ్బారెడ్డి, జాస్తి రాజన్ బాబు గారి కోకో తోటలు ఉన్నాయి. అదేవిధంగా నూజివీడు ప్రాంతానికి చెందిన జగ్గవరపు వీర రాఘవ రెడ్డి గారు, ముసునూరు మండలానికి చెందిన మొరవనేని వెంకట సీత రత్న కుమారి గారి కోకో తోటలను కూడా సందర్శించారు. ఈ సందర్శనల ద్వారా కోకో తల్లి మొక్కల ఎంపిక, అంట్లు కట్టే పద్ధతి, నర్సరీ లో నాణ్యమైన కోకో మొక్కల తయారు చేయుటకు పరివర్తన పద్ధతులు రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో CPCRI మాజీ డైరెక్టర్ డా. పి. చౌడప్ప , CPCRI శాస్త్రవేత్త డా. ఎలైన్ అప్సర, అంబాజీపేట శాస్త్రవేత్త డా. అశోక్, విజయరాయి శాస్త్రవేత్త డా. సుశీల, APMIP ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. ఎస్. రామమోహన్, జిల్లా ఉద్యాన అధికారి శ్రీ కె. సాజా నాయక్, సహాయ ఉద్యాన సంచాలకులు శ్రీ కె. సంతోష్ గారు, ఇతర ఉద్యాన అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.