గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పించాలి.. సిఐటియు ఉప్పవరం..
28/April/2026 06:42
Share:
యలమంచిలి,ఉప్పవరం గ్రామంలో ఉపాధి హామీ పనులు లేకపోవడంతో ఉపాధి కూలీలు తీవ్ర బంధువులు పడుతున్నారు. ఫిబ్రవరిలో ఒక వారం ఏప్రిల్ లో రెండు వారాలు పని పెట్టి అద్దాంతరంగా పనులు నిలిపియడం వలన ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీన్ని నిరసిస్తూ ఈరోజు అచ్యుతాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి ఎంపీడీవో కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పవరం గ్రామ మాజీ సర్పంచ్ చిన్ని శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్. రాము, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి.అప్పారావు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా పనైనా ఇవ్వాలి లేదా బృతి అయినా కల్పించాలని చట్టంలో ఉందని నేడు కేంద్ర ప్రభుత్వం 150 రోజులు పని కల్పిస్తామని హామీలు ఇస్తున్నది తప్ప ఆచరణలో 50 రోజుల కన్నా పనులు కల్పించడం లేదు కాబట్టి ఇప్పటికైనా ఉప్పవరం గ్రామంలో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించి ఉపాధి కూలీలు ఆదుకోవాలని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం ఎంపీడీవో ,ఉపాధి పథకం అధికారులు రెండు రోజుల్లో పనులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన నిర్మించడం జరిగింది.ఈ కార్యక్రమంలో చిన్ని సోమేశ్వరరావు, కాయల. సూర్య మని ,సుధా తాతబ్బాయి ,సునీత , గండేపల్లి అప్పారావు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.