“మత్తు వద్దు, జీవితమే ముద్దు” – అనకాపల్లి రూరల్ పోలీసుల డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం

“మత్తు వద్దు, జీవితమే ముద్దు” – అనకాపల్లి రూరల్ పోలీసుల డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం

26/April/2026 07:47    Share:   

(కొప్పాక గ్రామంలో యువత, తల్లిదండ్రులతో ఎస్ఐల రవికుమార్, నాగేశ్వరరావుల సమావేశం)
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు వద్దు జీవితమే ముద్దు అంటూ డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని శనివారం కొప్పాక గ్రామంలో అనకాపల్లి రూరల్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐలు రవికుమార్, నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో మత్తుపదార్ధాలు వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. యువత భవిష్యత్తు మత్తు పదార్థాల వాడకం వలన నాశనం అవుతుందని యువకులు భవిష్యత్తుపై దృష్టి సారించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామాలలో మత్తు పదార్థాలు వినియోగంపై పోలీసులకు డయల్ 100, 112, 1972 నంబర్లలో సమాచారం అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీసులు పోలీసులు, యువకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Breaking News

Subscribe our Newsletter