హెరిటేజ్ పాడి రైతుల అవగాహన సదస్సు – రైతులకు ప్రోత్సాహకాలు, సహాయాలు పంపిణీ.
25/April/2026 07:53
Share:
క్రైమ్ అనాల్సిస్ -టివియస్ ప్రకాష్ యలమంచిలి : అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామంలో హెరిటేజ్ డైరీ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్ డైరీ మేనేజర్ కూండ్రపు శేషు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఇటీవల మరణించిన పాడి రైతు అప్పికొండ బాబురావు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఆయన నామినీ అయిన భార్య అప్పికొండ సన్నాసమ్మకు రూ.50,000ను హెరిటేజ్ డైరీ రీజనల్ మేనేజర్ పి. తులసి నాయుడు చేతుల మీదుగా అందించారు.సదస్సులో మాట్లాడుతూ రీజనల్ మేనేజర్ పి. తులసి నాయుడు పాడి రైతులకు పాలు ఉత్పత్తి నాణ్యత, పాలలో మెలికలు (కల్తీ నివారణ), శుభ్రత ప్రమాణాలపై వివరంగా అవగాహన కల్పించారు. రైతులు ఈ కార్యక్రమాన్ని హర్షించారు.అదే విధంగా హెరిటేజ్ డైరీ ద్వారా రైతులకు అందిస్తున్న సదుపాయాలను వివరించారు,పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ కేవలం రూ.50కే అందుబాటులో ఉంటుంది.ఆడ దూడ పుట్టే విధంగా ప్రత్యేక గర్భధారణ సేవలు రూ.500కే అందిస్తారు.ప్రమాదవశాత్తు మరణించిన రైతుల కుటుంబానికి రూ.2 లక్షలు, సహజ మరణానికి రూ.50,000 ఆర్థిక సాయం అందజేస్తారు.మేనేజర్ కూండ్రపు శేషు మాట్లాడుతూ, జిల్లాలో ఇతర డైరీల కంటే హెరిటేజ్ డైరీ అధిక ధరకు పాలు కొనుగోలు చేస్తుందని తెలిపారు. గ్రామంలో హెరిటేజ్ డైరీ కార్యకలాపాలు ప్రారంభం కావడం రైతులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు.ఈ కార్యక్రమంలో అధికంగా పాలు సరఫరా చేస్తున్న రైతులకు ప్రథమ, ద్వితీయ బహుమతులతో సన్మానించారు.ఈ సదస్సులో ఏ. సాయికోటి, కే. నాగేశ్వరరావు, ఎన్. రమణాజీ, వెటర్నరీ అసిస్టెంట్ సి.హెచ్. రాము, సూపర్వైజర్ సి.హెచ్. గోవింద్, ఏ. నాగేశ్వరరావు, ఎస్. వెంకటి, పి. రమణ, కే. సత్తిబాబు, కే. అచ్చం నాయుడు, ఎం. మంగ తదితరులు పాల్గొన్నారు.