చైనీస్ హ్యూమనాయిడ్ రోబోకు అద్భుతం: హాఫ్ మారథాన్లో మనుషుల రికార్డును బద్దలు కొట్టేసింది!

చైనీస్ హ్యూమనాయిడ్ రోబోకు అద్భుతం: హాఫ్ మారథాన్లో మనుషుల రికార్డును బద్దలు కొట్టేసింది!

20/April/2026 09:57    Share:   

బీజింగ్: కృత్రిమ మేధస్సు (AI) యుగంలో మరో అద్భుతం చోటుచేసుకుంది. చైనాకు చెందిన ఒక హ్యూమనాయిడ్ రోబో పరుగులో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. హాఫ్ మారథాన్ (21 కిలోమీటర్లు) దూరాన్ని కేవలం 50 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి, ఉగాండాకు చెందిన ప్రముఖ రన్నర్ జాకబ్ పేరిట ఉన్న రికార్డును చెరిపివేసింది. జాకబ్ ఇంతకుముందు 57 నిమిషాల 20 సెకన్లలో ఈ దూరాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే.గతంలో నెమ్మదిగా పరిగెత్తి, సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ ఎదుర్కొన్న రోబోలు, ఇప్పుడు ఏకంగా మనుషుల రికార్డులనే అధిగమించడం విశేషం. తాజా ఈ రోబో అసాధారణ వేగం, స్టామినా, మరియు మేలు సామర్థ్యాలతో శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రోబోటిక్స్ రంగంలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచింది.భవిష్యత్తులో రోబోలు క్రీడల్లో మానవులతో పోటీపడటమే కాకుండా, సైన్యం, రెస్క్యూ ఆపరేషన్లు, మరియు ఇతర రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Breaking News

Subscribe our Newsletter