అండమాన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న విజయ భారతి జెల్ది
05/March/2026 07:39
Share:
ఫిబ్రవరి 27వ తేదీ నుండి 28వ తేదీలలో అండమాన్ నికోబార్ దీవుల్లోని శ్రీ విజయపురం (పోర్ట్ బ్లేయర్) లో నాగరి లిపి పరిషత్, న్యూఢిల్లీ, హిందీ సాహిత్య కళాపరిషత్, జవహర్లాల్ నెహ్రూ రాజకీయ మహావిద్యాలయ శ్రీ విజయపురం, అండమాన్ నికోబార్ దీవులు సంయుక్తగా నిర్వహించిన 49వ అఖిలభారత నాగరీలిపి సమ్మేళనం అత్యంత ఘనంగా నిర్వహించబడింది దేశ విదేశాల్లో నాగరీలిపి ప్రచార ప్రసార సంస్థ నాగరీలిపి పరిషత్ యొక్క 49వ అఖిల భారతీయ నాగరిలిపి సమ్మేళనం 27వ తేదీన శ్రీ విజయపురంలోని హిందీ సాహిత్య కళాపరిషత్ లో ప్రారంబించబడింది, ప్రారంభ మహోత్సవ సభకు నాగరీలిపి పరిషత్ యొక్క అధ్యక్షులు, పూర్వకులపతి ప్రొఫెసర్ ప్రేమ్చంద్ పతంజలి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అండమాన్ నికోబార్ రాజ భాషా ఉపకార్యదర్శి రాజేంద్ర ఇందవార్, విశిష్ట అతిథిగా నార్వే నుండి నాగరి హిందీ విశేషజ్ఞులు సురేష్చంద్ర శుక్ల, నేపాల్ జనక్పూర్ కు చెందిన ప్రొఫెసర్ అజయ్ కుమార్ ఝా పాల్గొని హిందీ సాహిత్య కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి బ్రజేష్ కుమార్ పాండేయ, సాహిత్య కార్యదర్శి జగదీష్ నారాయణ రాయ్ అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగరి లిపి పరిషత్ యొక్క ప్రధాన కార్యదర్శి, నాగరి సంగం పరిశోధనా పత్రిక ప్రధాన సంపాదకులు డాక్టర్ హరి సింగ్ పాల్ మాట్లాడుతూ అండమాన్ మరియు నికోబార్ దీవులలో మొట్టమొదటిసారిగా నాగరి లిపి సమ్మేళనము నాగరి లిపి అంతర్జాతీయ సంగోష్ఠి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సమ్మేళనానికి నార్వే నేపాల్, భారతదేశంలోని అస్సాం, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన నాగరి లిపి ప్రత్యేక నిపుణులు, పరిశోధకులు హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో జాతీయ సమైక్యత, నాగరీలిపి, భారతీయ జ్ఞాన పరంపర, నాగరీలిపి, సమాచార సాంకేతికత, నాగరీలిపి, విశ్వలిపిగా నాగరీలిపి, లిపిలేని భాషలు నాగరి అను అంశాలపై చర్చించడం జరిగిందని అన్నారు. జాతీయ సమైక్యత, నాగరీలిపి అనే అంశంపై యలమంచిలి శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందీ అధ్యాపకురాలు డాక్టర్ విజయభారతి జెల్ది ముఖ్య వక్తగా ప్రసంగిస్తూ, గాంధీ పిలుపునందుకొని స్వాతంత్ర ఉద్యమ సమయంలో హిందీ దేవనగరీల ప్రచార ప్రసారంలో తెలుగువారు అనేకులు తమతమై సహాయ సహకారాలను అందించారన్నారు. నేటికీ ఆ విధంగానే కొనసాగుతుందని జాతీయ సమైక్యతకు తెలుగువారు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆ విధంగానే ఉత్తర భారతీయులు దక్షిణ భారత భాషలను అభ్యసించి జాతీయ సమైక్యతకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఆ విధంగానే అన్ని భాషల్లోని సాహిత్యం దేవనాగరీలిపి లో వ్రాయబడితే అనేకులకు ఆ యా భాషల సాహిత్యం అందుబాటులో ఉండగలదని అన్నారు. 28వ తేదీన జవహర్ లాల్ నెహ్రూ రాజకీయ మహా విద్యాలయలో జరిగిన సమాచార సాంకేతికత, నాగరీలిపి అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె విశిష్ట అతిథిగా పాల్గొని తమ సందేశాన్ని అందించారు. వివిధ అంశాలపై వక్త లు పరిశోధనా పత్రాలను సమర్పించారు, ముగింపు సమావేశంలో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సమావేశంలో అండమాన్ నికోబార్ దీవు ల విభిన్న విభాగాల, విద్యాసంస్థల అధికారులు, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆన్లైన్ మా ద్యమం లో ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్, మారిషస్, నెదర్లాండ్, బల్గేరియా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి నాగరీ లిపి సమర్ధకు లు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.