ఉచిత వైద్య శిబిరం..ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన రెడ్డి అప్పల నాయుడు

ఉచిత వైద్య శిబిరం..ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన రెడ్డి అప్పల నాయుడు

14/April/2026 20:43    Share:   

18 వ డివిజన్ వంగాయగూడెంలో డా. బి.ఆర్.అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా ఆశ్రం హాస్పిటల్ వారిచే పల్లి విజయ్ గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం..ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన రెడ్డి అప్పల నాయుడు గారు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు, ఏప్రిల్ 14:- స్థానిక 18 వ డివిజన్ వంగాయగూడెం సెంటర్ లోని బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద 18 వ డివిజన్ జనసేన ఇంచార్జి పల్లి విజయ్ గారి ఆధ్వర్యంలో డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్బంగా ఏలూరు ఆశ్రం హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పల నాయుడు హాజరయ్యారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది.. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఈరోజు వంగాయిగూడెం సెంటర్లో జనసేన నాయకులు పల్లి విజయ్ ఆధ్వర్యంలో ఆశ్రమం హాస్పిటల్ వారిచే మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లటంలో సోదరుడు పల్లి విజయ్ ఇతర కమిటీ వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజలను అంబేద్కర్ మార్గంలో నడిపించాలని ఆయన కోరారు. ఈ శిబిరం నందు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, చెవి ముక్కు గొంతు, చర్మవ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, ఆర్థోపెడిక్, కంటి సంబంధిత వ్యాధులు, చిన్న పిల్లలకు సంబంధించిన డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. షుగర్, బిపి, ఎక్స్ రే, పొట్ట స్కానింగ్, కంటి వెజినరీ మరియు ముఖ్యంగా క్యాన్సర్ కు సంబంధించినటువంటి టెస్ట్ లు, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని,  ఇతర ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని ఏలూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రెడ్డి అప్పలనాయుడు కోరారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన జనసేన నాయకులు పల్లి విజయ్ ఇతర సభ్యులను రెడ్డి అప్పల నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, మెగా అభిమానులు, అంబేద్కర్ గారి అభిమానులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter