అంబేద్కర్ విగ్రహం వద్ద అసంపూర్తి పనులు: కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై మండిపడ్డ బీఎస్పీ నేత రామచంద్రరావు

అంబేద్కర్ విగ్రహం వద్ద అసంపూర్తి పనులు: కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై మండిపడ్డ బీఎస్పీ నేత రామచంద్రరావు

14/April/2026 16:37    Share:   

అనకాపల్లి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు సూరిశెట్టి విజయ రామచంద్రరావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అందాలని, పేదరిక నిర్మూలన జరిగినప్పుడే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని పేర్కొన్నారు.
అసంపూర్తిగా సిసి రోడ్డు పనులు.. అధికారుల స్పందన:
అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామం, డి.బి. కాలనీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్మించిన సిసి రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండటంపై రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వేసినా, పక్కన మట్టి వేయడం మరచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన పంచాయతీ సెక్రటరీ.. ఒక ట్రాక్టర్ మట్టి మాత్రమే వేశామని, మిగిలిన పనిని కాంట్రాక్టర్ వదిలేశారని వివరణ ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఏఈ (AE) గారు సదరు ప్రాంతాన్ని పరిశీలించి, పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టర్ కూడా మట్టి వేస్తానని అంగీకరించారు.
ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ.. "అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా నిర్లక్ష్యం వహించడం సరికాదు. పెండింగ్ ఉన్న మిగిలిన ముక్క (పని) ఎవరు పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వాలి" అని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం వద్ద గౌరవప్రదమైన వాతావరణం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు
Breaking News

Subscribe our Newsletter