ఆంధ్రా ఆటో డ్రైవర్లకు ఆర్థిక రక్షణ కల్పించాలి: అండ్రాజు రామరాజు

ఆంధ్రా ఆటో డ్రైవర్లకు ఆర్థిక రక్షణ కల్పించాలి: అండ్రాజు రామరాజు

12/April/2026 14:04    Share:   

క్రైమ్ అనాలిసిస్ టివిఎస్ ప్రకాష్, రేపల్లె:
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (ఫ్రీ బస్) అమలు కారణంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జై భారత్ నేషనల్ పార్టీ నేత అండ్రాజు రామరాజు పేర్కొన్నారు.మహిళలు ఎక్కువగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడం వల్ల ఆటోలకు ప్రయాణికులు తగ్గిపోయారని, దీనివల్ల వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆయన అన్నారు. సాధారణంగా ఆటోల్లో 80% వరకు మహిళలే ప్రయాణిస్తారని, ప్రస్తుతం ఆ సంఖ్య భారీగా తగ్గిపోయిందని తెలిపారు.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.ఆటో డ్రైవర్లకు ప్రతినెల రూ.5000 నగదు సహాయం మరియు రూ.2000 విలువైన సరుకులు ఇవ్వాలని సూచించారు.లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని.ఈ ఉద్యమాన్ని ప్రతి జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు.ఆటో డ్రైవర్ల కుటుంబాలు పూర్తిగా ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నాయని, వారి పిల్లల చదువు, కుటుంబ పోషణకు ఆటోనే ఆదారమని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ముందుంచాలా, లేక రాజకీయ ప్రయోజనాలను ముందుకు పెట్టాలా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Breaking News

Subscribe our Newsletter