యూజేఎఫ్ శ్రీకాకుళం శాఖ కొత్త కార్యవర్గం ప్రకటన యూజేఎఫ్  బలోపేతానికి కృషి

యూజేఎఫ్ శ్రీకాకుళం శాఖ కొత్త కార్యవర్గం ప్రకటన యూజేఎఫ్ బలోపేతానికి కృషి

09/April/2026 20:27    Share:   

యూజేఎఫ్ సేవలు అభినందనీయం శ్రీకాకుళం శాఖ కొత్త కార్యవర్గం ప్రకటన ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ సామాజిక బాధ్యతగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షులు, సేల్స్ టాక్స్ అధికారి ఆర్. వేణుగోపాలరావు అన్నారు. గురువారం సాయంత్రం శ్రీకాకుళం ఎన్జీవో హోమ్ లో జరిగిన యూజేఎఫ్ హ్యాండ్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వాణి వినిపిస్తున్న యూజేఎఫ్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.యూజేఎఫ్ అధ్యక్షులు డా. ఎం. ఆర్. ఎన్. వర్మ మాట్లాడుతూ మేథావులు, నిపుణుల సూచనలు, సలహాలతో ఉత్తరాంద్ర అభివృద్ధి కోసం సమగ్ర నివేదిక ను సంబంధిత అధికారులు, రాజకీయ ప్రముఖులకు అందజేయడం జరిగిందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వరరావు మాట్లాడుతూ యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఢిల్లీ స్థాయి లో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై గొంతు వినిపించిన సందర్భా లను గుర్తు చేశారు. అనంతరం నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షునిగా చౌదరి సత్యనారాయణ. కార్యదర్శిగా బూడుమూరు శ్రీరాములనాయుడు. కోశాధికారిగా సిపాన సూర్య ప్రకాష్ ఉపాధ్యక్షులుగా రమణమూర్తి. సహాయ కార్యదర్శిగా సూర్యారావు.ఈ కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్ట్ ఎంవి. మల్లేశ్వరరావు, యూజేఎఫ్ ప్రతినిధులు రాము,డి. హరనాథ్  తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter