తండ్రీకొడుకుల లాకప్ డెత్.. తమిళనాడులో 9 మంది పోలీసులకు మరణ శిక్ష

తండ్రీకొడుకుల లాకప్ డెత్.. తమిళనాడులో 9 మంది పోలీసులకు మరణ శిక్ష

07/April/2026 07:44    Share:   

తమిళనాడులో సంచలన తీర్పు..! 9 మంది పోలీసులకు మరణశిక్ష..!!
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి :
తమిళనాడులో సంచలనం సృష్టించిన కస్టడీ మృతి కేసులో కీలక తీర్పు వెలువడింది. మదురై అదనపు సెషన్స్ న్యాయమూర్తి తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధించారు. దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఇది అరుదైన తీర్పుగా భావిస్తున్నారు.2020 జూన్ 19న తూత్తుకుడి జిల్లాలోని సాతాంకులం పోలీస్ స్టేషన్‌లో పి. జయరాజ్ మరియు ఆయన కుమారుడు బెనిక్స్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారిని తీవ్రంగా హింసించారని, ఆ హింస కారణంగానే వారు మరణించారని కోర్టు నిర్ధారించింది.ఈ కేసులో సీఐతో పాటు పలువురు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కలిపి మొత్తం తొమ్మిది మందికి మరణశిక్ష విధించారు. అంతేకాకుండా, నిందితులను ఒకరి తర్వాత ఒకరిని ఉరితీయాలని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కస్టడీలో జరిగే హింసపై కఠిన చర్యలకు ఇది ఒక కీలక ఉదాహరణగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
Breaking News

Subscribe our Newsletter