అనకాపల్లి జిల్లా పోలీస్ అధికారులకు 14 మందికి డి.జి.పి. కమండేషన్ డిస్క్ అవార్డులు
30/March/2026 22:04
Share:
అనకాపల్లి జిల్లా పోలీస్ అధికారులకు ప్రతిష్టాత్మక 'డి.జి.పి. కమండేషన్ డిస్క్' అవార్డుల ప్రకటన. అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణం: 14 మందికి డి.జి.పి. కమండేషన్ డిస్క్ అవార్డులు అనకాపల్లి, మార్చి 30: పోలీస్ శాఖలో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, అసాధారణ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) ఇచ్చే ప్రతిష్టాత్మక 'డి.జి.పి. కమండేషన్ డిస్క్' (DGP Commendation Disc) అవార్డులు 2025 సంవత్సరానికి గాను ప్రకటించబడ్డాయి. ఈ పతకాల జాబితాలో అనకాపల్లి జిల్లాకు చెందిన 14 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బంది చోటు సంపాదించుకోవడం జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచింది. ఈ 14 అవార్డులలో 3 సిల్వర్ (వెండి) మరియు 11 బ్రాంజ్ (కాంస్య) పతకాలు ఉన్నాయి. అవార్డు గ్రహీతల వివరాలు: DGP సిల్వర్ డిస్క్ (Silver Disc) గ్రహీతలు: ఎల్.అప్పారావు, పీసీ-2340 (సబ్బవరం పి.ఎస్.) వై.నరసింహ మూర్తి, పీసీ-255 (కె.డి.పేట పి.ఎస్.) కె.రమణ, పీసీ-418 (మునగపాక పి.ఎస్.) DGP బ్రాంజ్ డిస్క్ (Bronze Disc) గ్రహీతలు: వై.తారకేశ్వర రావు, ఎస్సై (కె.డి. పేట పి.ఎస్.) బి.సురేష్ బాబు, ఎస్సై (ఐ.టి కోర్) బి.అప్పారావు, ఏఎస్సై-886 (కొత్తకోట పి.ఎస్.) బి.శ్రీనివాస రావు, హెచ్.సి-1528 (సబ్బవరం పి.ఎస్.) ఎం.హేమంత కుమార్, హెచ్.సి-1544 (డి.సి.ఆర్.బి) ఎస్.వరాహ బాబు, హెచ్.సి-1486 (డి.ఎస్.బి) కె.చిరంజీవి, హెచ్.సి-2003 (కె.డి.పేట పి.ఎస్.) బి.సత్యనారాయణ, పీసీ-2331 (పరవాడ పి.ఎస్.) బి.గోవింద రావు, పీసీ-462 (ఐటి కోర్) పి.ఎస్.జి.పవన్ కుమార్, పీసీ-409 (పాయకరావుపేట పి.ఎస్.) ఏ.ఎస్.కృష్ణ మూర్తి, ఏ.ఆర్ పీసీ-2573 (డి.ఏ.ఆర్.) ఎస్పీ గారి అభినందనలు మరియు పురస్కార ప్రదానం ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు పతకాలు సాధించిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఐటి కోర్ ఎస్సై బి.సురేష్ బాబు, పీసీలు బి.గోవింద రావు, ఏ.ఎస్.కృష్ణ మూర్తి మరియు డి.సి.ఆర్.బి హెచ్.సి ఎం.హేమంత కుమార్ లకు ఎస్పీ గారు స్వయంగా పతకాలు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ లక్షణా మూర్తి, సైబర్ క్రైమ్ / సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు."పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమిస్తూ, వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించాలి. ఇలాంటి అవార్డులు సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపుతాయని, భవిష్యత్తులో మరింత మంది సిబ్బంది ప్రశంసాపూర్వకమైన విధులు నిర్వహించి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు..