ఏలూరు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక.
30/March/2026 21:25
Share:
ఘనంగా ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధమ మహాసభ.ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే బడేటి చంటి, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు.జర్నలిస్ట్ సేవలు మరువలేనివి ఎమ్మెల్యే బడేటి.ఏపీ బీజేఏ అధ్యక్ష కార్యదర్శుగా పి.నారాయణ, ఎం.కిరణ్. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, మార్చ్ 30 : ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ క్రాఫ్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీ బి జె ఏ) ఏలూరు జిల్లా మహాసభను ఏలూరులోని పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం భవనంలో సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శు ఎస్.డి.జబీర్, వై.వి. హరీష్ అధ్యక్షతన మహాసభలు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల సేవలు మరువలేనివని కొనియాడారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా దానిని వెలికి తీసి, అధికారుల, నాయకుల దృష్టికి తీసుకువెళ్లడంలో విలేకరులు ఎల్లప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. జర్నలిస్టులకు అత్యంత ఉన్నత గౌరవం దక్కాలని తమ సిద్ధాంతాలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. చాణక్యమంది సోషల్ మీడియం, ఫొటోజర్నలిజం గురించి మాట్లాడుతుంటారని, అయితే జర్నలిజం అనేది అత్యున్నతమైన ఆలోచనలతో కూడుకున్నదని, అలాంటి వ్యకిత్వ లక్షణాలు ఉన్నవారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ లు ఏ ఆపదలో ఉన్న ముందుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ యూనియన్ సభ్యులు స్పందించి వారికి తగిన సహకారం అందించడంలో ముందు ఉండటం ఎంతో సంతోషకరమంటూ ఆయన యూనియన్ సభ్యులను కొనియాడారు. ఏలూరులో జర్నలిస్టు మిత్రులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సొంత ఇంటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వివరించడం జరిగిందని ముఖ్యమంత్రి సహకారంతో కొద్ది రోజుల్లోనే అర్హులైన ప్రతి జర్నలిస్ట్ సోదరులకు సొంత ఇంటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే చంటి హామీ ఇచ్చారు.మీడియా జిల్లా కార్యాలయం ఏర్పాటు కు తాను సహకారం అందిస్తా నని హామీ ఇచ్చారు.ఏపీ బిజెఏ నూతన కమిటీ వదంతులు ప్రచారం చేయ్య రాదని హితవు పలికారు. ఏలూరు నియోజకవర్గంఅన్ని రంగాల్లో రాష్ట్రా నికి ఆదర్శంగా నిలవాలని కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. మీడియా ఇందుకు సహకారం అందించి అభివృద్ధికి బాటలు వెయ్యా లన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని రాజ్యాంగంలో 4 వ స్థంభంగా పిలిచే మీడియా నేడు ముక్కలు అయిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని కేంద్ర రద్దుచేసిందన్నారు. జర్నలిస్టులను దిగజార్చడానికే నేషనల్ మీడియా కౌన్సిల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో వర్కింగ్ జర్నలిస్టులకు ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. ఆర్ ఎన్ ఐ ను మార్చివేసి పి ఆర్ జి ఐ ను ఏర్పాటు చేసిందని అన్నారు. “బలమైన, స్వతంత్ర విధానం లేకుండా ప్రజాస్వామ్యం సజావుగా నడపదని ఆయన ఆవేద వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు అందరూ ఎదుర్కొంటున్న సమస్యలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ నాయకులు బాలశౌరి, ఇక్కడేషన్ కమిటీ సభ్యులు శంకర్రావు, కళ్యాణ్, మహా న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ ఎం. భరత్, బి ఆర్ కే న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కే.బ్రహ్మం, 99 టీవీ స్టాఫ్ రిపోర్టర్ రాంబాబు, మెగా 9 టీవీ స్టాప్ రిపోర్టర్ చైతన్య, స్వతంత్ర టీవీ స్టాఫ్ రిపోర్టర్ సంజయ్, క్రైమ్ రిపోర్టర్ ఊర్ల శీను, ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏలూరు జిల్లా యూనియన్ నాయకులు సోమశేఖర్ , ప్రతాప్, శరత్,జయరాం, సజ్జి మ్యాచెస్, దాస్, మిల్టన్ ప్రతాప్ ,సతీష్, చింతపల్లి శ్రీనివాస్, దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.