యలమంచిలి:
యలమంచిలి పురపాలక సంఘం పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుందని మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అంతరాయానికి కారణం:
సోముదేవపల్లి నుండి ఎర్రవరం సంప్‌కు నీటిని సరఫరా చేసే ఆర్.డబ్ల్యూ.ఎస్ (RWS) విభాగపు 350 ఎం.ఎం. పంపింగ్ మెయిన్ లైన్ వద్ద పురుషోత్తపురం సమీపంలో విద్యుత్ శాఖ వారు స్తంభాలు వేస్తుండగా పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీ మరమ్మత్తుల నిమిత్తం సోముదేవపల్లి వద్ద వాటర్ పంపింగ్ నిలిపివేయడం జరిగింది.
నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు:
యలమంచిలి టౌన్, పాతవీధి, ఫైర్ ఆఫీస్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, నెహ్రూ నగర్, భవనం వీధి, కొత్తపేట, యనాద్రి కాలనీ, కొత్త ఎర్రవరం, ఎర్రవరం, ఏ.ఎస్.ఆర్ కాలనీ, రాంనగర్
పాక్షికంగా సరఫరా అయ్యే ప్రాంతాలు:
ధర్మవరం మరియు కోర్టు ఏరియా ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరా జరుగుతుంది.
మరమ్మత్తుల దృష్ట్యా ప్రజలు సహకరించాలని, అత్యవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు