దివ్యాంగుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మనం చారిటబుల్ ట్రస్ట్
22/March/2026 20:36
Share:
రిపోర్టర్ కన్నేపల్లి శ్రీను/ యలమంచిలిలో మనం చారిటబుల్ ట్రస్ట్ సాయానికి పరిచయంతో పని లేదు అంటూ మరొకసారి నిరూపించారు. మనం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. వివరాల లోకి వెళ్తే పూసల సత్యనారాయణ అనే వ్వక్తి చిన్న వయసులోనే ఎడమకాలు కోల్పోయి దివ్యంగుడు అయ్యారు. అతను యలమంచిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1993లో పదవ తరగతి పూర్తి చేశారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్లు. నిరుపేద ఐన సత్యనారాయణ టీ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని నడుపుకుంటున్నారు. ఐతే విధి అయన కష్టాలను ఆక్సిడెంట్ రూపంలో మరింత పెంచింది.ఈ మధ్య జరిగిన ఆక్సిడెంట్ లో కుడి కాలు కూడా విరిగిపోయింది. డాక్టర్స్ శస్త్ర చికిత్స చేయాలి అంటున్నారు. దానికి తోడు దవడ ఎముక విరిగిపోవడంతో మరొక నాలుగు శస్త్ర చికిత్సలు చేయాలి అంటున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స ఉచితం ఐనా కూడా అతని కుటుంబం నడవడం ఇబ్బందిగా ఉండటం తో మనం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వారి కష్టాలను గుర్తించి పదివేల రూపాయల ఆర్ధిక సహాయమును సత్యనారాయణ మిత్రుల ద్వారా అందజేశారు.ఈ కార్యక్రమం లో ట్రస్ట్ ప్రెసిడెంట్ ఎమ్. గోపి,వైస్ ప్రెసిడెంట్ యస్. సతీష్ వ్యవస్థాపక కార్యదర్శి పి. సురేష్,కోశాధికారి సీ హెచ్. శ్యామలరావు, ట్రస్ట్ సభ్యులు కర్రి వీరు నాయుడు మాస్టారు, తంగేటి సూర్య ప్రకాష్, ఏ. మణి కుమార్,హాకీ సాయి, కె. వీర భద్ర రాజు, ఆర్ గోవింద్, వై. నూకరాజు, స్. కె. ఖాసీం, ఏ స్ న్ గుప్తా, ఎస్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.