అనకాపల్లి జిల్లా డిశా (DISHA) సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ: అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష.
19/May/2026 08:02
Share:
శ్రీనివాస్ ఏ క్రైమ్ ఎనాలిసిస్, జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి. అనకాపల్లి జిల్లా కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై కీలక సమీక్ష జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (DISHA) సమావేశంలో అనకాపల్లి శాసనసభ్యులు,మాజీ మంత్రివర్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న పలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు,మౌలిక సదుపాయాల కల్పన మరియు వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఈ సమావేశంలో అధికారులతో ఆయన విస్తృతంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, ప్రజలకు సంక్షేమ ఫలాలు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.